Soap vs Shower Gel : ఎన్నో ఏళ్లుగా స్నానానికి సబ్బునే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ దీనిని వినియోగించేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో సబ్బు నుంచి షవర్​ జెల్​కి మారుతున్నవారు కూడా ఉన్నారు. పైగా సబ్బు కంటే ఇదే మంచిదని చెప్పేవారు కూడా ఉన్నారు. అసలు స్నానానికి సబ్బు మంచిదా? షవర్ జెల్ మంచిదా? ఈ రెండిటీలో ఏది బెస్ట్.. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


చర్మం రకం, వ్యక్తిగత ప్రధాన్యతలు, స్కిన్​ కేర్​, చర్మ సమస్యలకు అనుగుణంగా సబ్బు, షవర్ జెల్ ఎంచుకుంటారు. అయితే ఈ రెండిటిలో చర్మానికి ఏది మంచిది? సబ్బును వినియోగిస్తే కలిగే లాభాలు ఏంటి? సబ్బును ఎవరు వినియోగించకూడదు. షవర్ జెల్​ను ఎవరైనా ఉపయోగించవచ్చా? దీని వల్ల చర్మానికి కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. 


సబ్బు


సబ్బును ఉపయోగిస్తే పొడి చర్మాన్ని తగ్గిస్తుంది. ఇది దూరం తేమను అందిస్తుంది. సబ్బులు తేమను లాక్ చేసే పదార్థాలు ఉంటాయి. ఆల్కలీన్ ఎక్కువగా ఉండే సబ్బులు ఎంచుకుంటే మంచిది. అధిక pH ఉండే సబ్బులు చికాకును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. సువాసన ఎక్కువగా ఉండే, రంగుల సబ్బులు చర్మంపై కఠినంగా పనిచేసి చికాకును కలిగిస్తాయి. 


షవర్ జెల్ 


షవర్ జెల్ తేలికగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉండేవారికి ఇది మంచి ఆప్షన్. సబ్బుకంటే షవర్​ జెల్ సున్నితంగా తక్కువ రాపిడిని ఇస్తుంది. ఎక్కువ చికాకు ఉండదు. షవర్ జెల్ చర్మంలోని సహజ నూనెలను తొలగించగలదు. షవర్​ జెల్​ని ఉపయోగించి సరిగ్గా క్లీన్​ చేసుకోకపోతే చర్మం పొడిబారుతుంది. చికాకు దారితీస్తుంది.


సబ్బు మంచిదా? షవర్ జెల్ బెస్టా?


మీ స్కిన్ టైప్​ని బట్టి మీ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. మీకు డ్రై, సెన్సిటివ్ స్కిన్ ఉంటే సబ్బు ఉపయోగిస్తే మంచిది. ఇది మీకు మాయిశ్చరైజర్​ని అందిస్తుంది. ఆయిల్ స్కిన్ ఉంటే షవర్​ జెల్ మంచిది. నార్మల్, కాంబినేషన్ స్కిన్ ఉంటే.. సబ్బు, షవర్ జెల్ రెండూ బాగా పని చేస్తాయి. మీ పర్సనల్ రీజన్స్ బట్టి వీటిని ఎంచుకోవచ్చు. 


ఇలా ఎంచుకోండి.. 


మీ స్కిన్ టైప్​కి సరిపోయే సున్నితమైన, సువాసన లేని పదార్థాలు ఉన్న సబ్బు, షవర్​ జెల్​ని ఎంచుకుంటే మంచిది. సబ్బు లేదు షవర్ జెల్ ఉపయోగించినా.. స్నానం చేసిన తర్వాత మీ చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు మాయిశ్చరైజర్​ తప్పక ఉపయోగించాలి. ఇది పొడి బారడాన్ని తగ్గిస్తుంది. కొత్త సబ్బు లేదా షవర్ జెల్ ఉపయోగిస్తే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. 


మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవారు అయితే షవర్ జెల్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఉపయోగించిన సబ్బును ట్రావెల్​లో తీసుకువెళ్లడం కష్టంగానే ఉంటుంది. కానీ షవర్​ జెల్ బాటిల్​ని క్యారీ చేయడం చాలా ఈజీ. లేదంటే మీకు కంఫర్ట్​గా ఉండే సబ్బును ముక్కలుగా చేసి ఉపయోగించుకోవచ్చు. లేదంటే చిన్న సోప్స్ తీసుకెెళ్లవచ్చు. 





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.