AP POLYCET 2024 Toppers List: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీ పాలిసెట్-2024' ఫలితాలు మే 8న వెలువడిన సంగతి తెలిసిందే. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఫలితాల్లో ఈసారి మొత్తం 87.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్ష కోసం మొత్తం 1,42,025 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. ఇందులో 1,24,430 మంది అర్హత సాధించారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా 50,710 (89.81%) మంది అర్హత సాధించారు. ఇక బాలురు 85,561 మంది పరీక్షకు హాజరుకాగా 73,720 (86.16%) మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఆరుగురికి 120 మార్కులు..ఫలితాల్లో 87.17 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 70.46 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లా అట్టడుగున నిలిచింది. పాలిసెట్-2024 ఫలితాల్లో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఆరుగురు విద్యార్థులు 120 కి 120 మార్కులు సాధించారు. ఇందులో ఇద్దరు తూర్పుగోదావరి, ఇద్దరు పశ్చిమగోదావరి, ఇద్దురు విశాఖపట్నానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఇక ఏడుగురు విద్యార్థులు 119 మార్కులు సాధించారు. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన విద్యార్థికాగా.. తూర్పుగోదావరికి చెందిన విద్యార్థులు ఇద్దరు, పశ్చిమగోదావరికి చెందిన విద్యార్థులు నలుగురు ఉన్నారు. మొత్తంగా వీరిలో టాప్-13లో తూర్పుగోదావరి విద్యార్థులు నలుగురు, పశ్చిమగోదావరి విద్యార్థులు ఆరుగురు, విశాఖపట్నం విద్యార్థులు ముగ్గురు ఉన్నారు.  

పరీక్షలో కటాఫ్ మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీసం అర్హత మార్కులు ఉండవు.  పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 267 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కళాశాలల్లో 29 కోర్సుల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 18,141 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 64,729 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏపీ పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

పాలిసెట్ టాపర్లు వీరే..

హాల్‌టికెట్ నెంబరువిద్యార్థి పేరుజెండర్మార్కులుర్యాంకుజిల్లా
2701142చల్లా నాగవెంకట సత్య శ్రీవర్షిణి F120 1తూర్పుగోదావరి
2921346పులకందం మోహిత్ క్రిష్ణసాయి M1201పశ్చిమగోదావరి
2711001జొన్నలగడ్డ యశ్వంత్ సాయి  M1201తూర్పుగోదావరి
1981132సీలం శ్రీరామ్ భవదీప్  M1201విశాఖపట్నం
1861141పోతుల జ్ఞాన హర్షిత F1201విశాఖపట్నం
1971162 సీలం ఐశ్వర్య  F1197విశాఖపట్నం
2661233 దేవ శ్రీవేద్  M1197తూర్పుగోదావరి
2691360 గొల్ల ప్రభవ్ తేజ 1197తూర్పుగోదావరి
2971104 కాకర్ల శ్రీ సాయినాగ్  1197పశ్చిమగోదావరి
2981140సిరిమల్ల లక్ష్మీ తనుష్క  F1197పశ్చిమగోదావరి
2981221రెడ్డి జీవన్  M1197పశ్చిమగోదావరి
3001226 గుడ్ల సాహితి  F1197పశ్చిమగోదావరి

ఏపీలో ఏప్రిల్ 27న ఎస్బీటీఈటీ పాలిసెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రాథమిక కీని ఏప్రిల్ 30న విడుదల చేశారు. ఆన్సర్ కీపై విద్యార్థుల నుంచి  మే 4 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తుది ఆన్సర్ కీని మే 5న SBTET విడుదల చేసింది. తాజాగా పాలిసెట్ ఫలితాలను విడుదల చేసింది. త్వరలోనే పాలిసెట్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించి నుంది. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త విద్యాసంవత్రం జూన్ 10 నుంచి ప్రారంభంకానుంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..