తెలంగాణలో విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌కు సంబంధించిన కొత్త దరఖాస్తు, రెన్యూవల్ గడువు జనవరి 31తో ముగియనుంది. దరఖాస్తుకు మరో 13 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గడువు సమీపిస్తున్నా.. ఇప్పటికీ 3 లక్షల మంది దరఖాస్తుకు దూరంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. కొత్త విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోయారు. 


2022-23కి వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఆలస్యం కావడంతో ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు గడువును ఎస్సీ సంక్షేమశాఖ పొడిగించిన సంగతి తెలిసిందే. అయినా.. నేటికీ పలువురు విద్యార్థులు ఇంకా దూరంగా ఉండటంతో వారితో వెంటనే దరఖాస్తు చేయించాలని కోరుతూ కళాశాలలకు జిల్లా అధికారులు లేఖలు రాస్తున్నారు.


ఫీజు రీయంబర్స్‌మెంట్ పొందుతున్నందున జనవరి 31లోగా అర్హులైన విద్యార్థులతో దరఖాస్తు చేయించే బాధ్యత కళాశాలల యాజమాన్యాలకు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. 2022-23 ఏడాదికి విద్యార్థుల సంఖ్య 13 లక్షలకు చేరుకుంటుందని వివిధ సంక్షేమ శాఖలు అంచనా వేస్తున్నాయి. 


ప్రస్తుత విద్యాసంవత్సరానికి రెన్యువల్ కింద 8.20 లక్షల మంది విద్యార్థులు అర్హులుగా ఉంటే.. ఇప్పటికి 6.87 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఇప్పటికీ 1.33 లక్షల మంది దరఖాస్తు చేయలేదు. మరోవైపు ఈ ఏడాది కొత్త విద్యార్థుల్లో 5లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటారని ల అంచనా. ఇప్పటివరకు 3.3 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. మరో 3 లక్షల మంది దరఖాస్తుకు దూరంగా ఉండిపోయారు. విద్యాసంవత్సరం మగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి దరఖాస్తు గడువు పొడిగిస్తుందో లేదో చూడాలి. 


Also Read:


TISS Admissions: 'టిస్‌'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. పీజీ కోర్సుల దరఖాస్తుకు జనవరి 15తో ముగియాల్సిన గడువును అధికారులు జనవరి 28 వరకు పొడిగించారు. ఇప్పటికదాకా దరఖాస్తు చేసుకోలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
ప్రవేశ ప్రకటన, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...