తెలంగాణలో  మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 4 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. దీనిద్వారా హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ/ మైనారిటీ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డెంటల్ కాలేజీలు, ఆర్మీ డెంటల్ కాలేజీ, నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.


ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు కోరే అభ్యర్థులు ఆగస్టు 4న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 12న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నీట్ యూజీ 2023 అర్హత సాధించి నిర్ణీత కటాఫ్ స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా మేనేజ్‌మెంట్ కోటాలో 25 శాతం సీట్లను నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ విద్యార్థులకు కేటాయించనున్నారు.


కటాఫ్ స్కోరు ఇలా..


➥ జనరల్ - 50 పర్సంటైల్- 137 స్కోరు


➥ ఎస్సీ/ఎస్టీ/బీసీ & దివ్యాంగులు - 50 పర్సంటైల్- 107 స్కోరు


➥ ఓసీ దివ్యాంగులు - 45 పర్సంటైల్- 121 స్కోరు.


దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు ఇవే..



  • నీట్ యూజీ 2023 ర్యాంకు కార్డు

  • బర్త్ సర్టిఫికేట్ (పదో తరగతి మార్కుల మెమో)

  • ఇంటర్ మార్కుల మెమో లేదా తత్సమాన సర్టిఫికేట్

  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)

  • క్యాస్ట్ సర్టిఫికేట్

  • మైనారిటీ సర్టిఫికేట్

  • ఎన్నారై స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్-డిక్లరేషన్ ఫామ్ (ఎన్నారై కోటా)

  • ఎన్నారై స్టేటస్ సర్టిఫికేట్ (ఎన్నారై కోటా)

  • ఫైనాన్షియల్ సపోర్టర్ ఎన్నారై బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాపీ సర్టిఫికేట్ (ఎన్నారై కోటా)

  • ఎన్నారై ఫైనాన్షియర్ పాస్‌పోర్ట్ కాపీ (ఎన్నారై కోటా)

  • ఆర్మీ డెంటల్ కాలేజీలో ప్రవేశాలకు -  ఎక్స్-సర్వీస్‌మెన్ ఐడీకార్డు, డిశ్చార్జ్ బుక్, పీపీవో, ఇతర అవసరమైన సర్టిఫికేట్లు

  • ఆధార్ కార్డు

  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు

  • ఇంటర్ లేదా తత్సమాన స్టడీ సర్టిఫికేట్ 

  • అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, సంతకం సిద్ధంగా ఉంచుకోవాలి.


సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..


➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tsmedadm2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 
➥ నిబంధలనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrugadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 
➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9959101577 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 
➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.


Notification


Prospectus


Web Counselling Link


ALSO READ:


ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌, వెబ్‌కౌన్సెలింగ్ తేదీలివే
కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 4 నుంచి 6 వరకు వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్  చేయండి..


ఎంపీసీ విద్యార్థులకు 'స్పెషల్ కౌన్సెలింగ్‌' ద్వారా ఫార్మసీ సీట్ల కేటాయింపు
తెలంగాణలో రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌, పూర్తి షెడ్యూలు ఇలా
తెలంగాణలో ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ఆగ‌స్టు 4 నుంచి ప్రారంభంకానుంది. ఆగ‌స్టు 5న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 9న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఈసారి ప్రత్యేక విడత పేరిట కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించనున్న మరో కౌన్సెలింగ్‌  ఆగస్టు 17న ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్ కోసం ఆగస్టు 17న స్లాట్‌ బుకింగ్‌, ఆగస్టు 18న ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఆగస్టు 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 23 నుంచి 25 వరకు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..