తెలంగాణలో పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం(జులై 9) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌(పీజీ)-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హులైన అభ్యర్థులు జులై 10న ఉదయం 10 గంటల నుంచి జులై 17న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కాళోజీ వర్సిటీ సూచించింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.


ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్‌ జాబితా విడుదల అనంతరం వెబ్‌ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. 


KNRUHS-PG Admission Notification


KNRUHS-PG Admission Prospectus


Online Registration


ALSO READ:


సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!
తెలంగాణలోని సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త వినిపించింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం(జులై 6న) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్ల‌ల‌కు కేటాయించడం జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం (జులై 7) ప్రారంభించింది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్‌ కటాఫ్‌ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు. జనరల్‌ క్యాటగిరీకి, ఈడబ్ల్యూఎస్‌ కోటాకు 137 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆయా క్యాటగిరీల్లోని దివ్యాంగులకు 107 మార్కులు (40 శాతం), జనరల్‌ క్యాటగిరీ దివ్యాంగులకు 121 మార్కులు (45 శాతం) కటాఫ్‌గా నిర్ణయించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జులై రెండోవారంలో ఎంబీబీఎస్‌ ప్రవేశ ప్రకటన, 6 వేలకు పైగా సీట్లు అందుబాటులో!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో  2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు జులై రెండో వారంలో  నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇందుకు సంబంధించి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 16 ప్రభుత్వ, 17 ప్రైవేటు వైద్య కళాశాలల్లో దాదాపు 6,109 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన (2014 జూన్ 2) తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్(స్థానికేతర) సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial