తెలంగాణలో ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు జనవరి 6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 5న ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.


బీఎస్సీ నర్సింగ్‌కు ఆఖరి విడత ప్రవేశాలు
బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు జనవరి 6న ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య వర్సిటీ తెలిపింది. ఖాళీల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చామనీ, అర్హులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని పేర్కొంది.


ఆయుష్ పీజీ సీట్లకు..
రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 5న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జనవరి 6న ఉదయం 9 గంటల నుంచి 13న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.


మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.. 


MSc/MPT



Also Read:


గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. అర్హులైన విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సులు, కళాశాలల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


యూజీసీనెట్ 2022 దరఖాస్తు ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 


TS SET - 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 30న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి. 2023 మార్చి మొదటి లేదా రెండోవారంలో ఆన్‌లైన్ విధానంలో టీఎస్ సెట్-2022 పరీక్షలను నిర్వహించనున్నారు.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...