యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను ఫిబ్రవరి 14 వరకు స్ట్రే వేకెన్సీ విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్ధులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
అలాగే కాంపిటేటివ్ కోటా కింద మాపప్ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, చేరని అభ్యర్థుల వివరాలను కూడా హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. మొత్తం 67 మంది విద్యార్థులు కళాశాలలో చేరలేదు.
కళాశాలల్లో చేరని విద్యార్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!
విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో పీజీలో చేరడానికి లేదా ప్రాక్టీసు చేయడానికి.. వారు ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ)'లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. ఆ ధ్రువపత్రం లేకుండా ఎఫ్‌ఎంజీఈకి చేసుకునే దరఖాస్తులను తిరస్కరిచనున్నట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది. ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ధ్రువపత్రం పొందాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చి 8న సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తిస్థాయి వివరాలు నమోదు చేయని అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!
తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. అయితే జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, అలాగే.. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌కు అర్హులు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..