యష్ వేదకి సోరి చెప్తాడు. నీ మీద అనవసరంగా అరిచేశాను, బ్యాడ్ గా బిహేవ్ చేశాను, నేను అలా చేసి ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా అది నా మంచికొసమే చెప్పావ్. మాళవికకి మేలు చేయాలని చెప్పావ్. నా కొడుకు ఆదిత్య గురించి తల్లిలా ఆలోచించి చెప్పావ్, తండ్రిగా నా బాధ్యత గుర్తు చేశావ్. అలాంటి నీ మీద కొప్పడి ఉండకూడదు, నిన్ను హర్ట్ చేసి ఉండకూడదు. ఐ సొ సోరి వేద’ అని చెప్తాడు. ‘ఎవరు చెప్పారు నేను ఫీల్ అయ్యానని, భర్త కోపానికి బాధపడేది కాదు భార్య, భర్త కోపం వెనుక కారణాన్ని సరిగా అర్థం చేసుకునేది భార్య. నేను ఆలోచించింది మాళవిక గురించి కాదు తన దగ్గర ఉన్న మన అబ్బాయి. మాళవిక తప్పుకి ఆదిత్య భవిష్యత్ ఏమవుతుందని బాధపడుతున్నా’ అని వేద అంటుంది.


Also Read: రాజ్ చెంప మీద కొట్టిన కావ్య- కనకం ఇంటికి పెళ్ళిచూపులకు వస్తామన్న అపర్ణ


‘నా కోపాన్ని భరించడం నీకు సులువు ఏమో కానీ నీ మంచితనాన్ని భరించడం నా వల్ల కాదు. థాంక్స్ వేద. నీకు హాని చేసిన వాళ్ళకి కూడా మంచి చేయాలని చూస్తావ్. నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. థాంక్యూ సొ మచ్ వేద’ అని అంటాడు. అందరికీ లైఫ్ లో సెకండ్ ఛాన్స్ దొరికదు కానీ మీకు దొరికిందని విన్నీ చెప్పిన మాటలు వేద గుర్తు చేసుకుని ఆలోచనలో పడుతుంది. మాళవిక గురించి ఓపెన్ గా ఎందుకు చెప్పావ్ అని భ్రమరాంబిక అభిమన్యుని తిడుతుంది. ఆ మాళవిక ఒక గుదిబండలా తయారయ్యింది దాన్ని వదిలించుకోవాలని సలహా ఇస్తుంది. అందుకే వేరే దాన్ని వెతికాను చిత్ర.. వసంత్ యశోధర్ కి తమ్ముడులాంటి వాడు. వాడి ఫియాన్సీ ఇది. వాళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. తనని లొంగదీసుకుంటే చాలు అటు యష్, ఇటు వేద ఫ్యామిలీలు అల్లకల్లోలం అయిపోతాయని అభి ప్లాన్ వేస్తాడు.


మాళవిక తాము చెప్పిన మాటలు నమ్మడం లేదని వేద చిత్రతో చెప్తుంది. తనకి సాయం చేయాలని అంటుంది. అభిమన్యుకి మాళవిక వల్ల హాని జరగకుండా చూడాలి. నువ్వు అక్కడే కాబట్టి పని చేస్తుంది. తన మీద ఒక కన్ను వేసి ఉంచు. మాళవికకి వ్యతిరేకంగా అతను ఏ పని చేసినా అలర్ట్ గా ఉండమని చెప్తుంది. అందుకు చిత్ర కూడా సరే అంటుంది. ఈరోజు ప్రేమికుల రోజు మంచి రోజు బావతో మనసు విప్పి మాట్లాడి చూడమని చిత్ర వేదకి సలహా ఇస్తుంది. సెకండ్ ఛాన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటని వేద యష్ ని అడుగుతుంది. అంటే ఏంటని యష్ ఆయోమయంగా అడుగుతాడు. ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు రెండో సారి ప్రేమలో పడొచ్చు అంటారా అని వేద అడుగుతుంది. ప్రేమని మించిన పిచ్చి పని మరొకటి లేదు, ఆ పిచ్చి పని ఒక్కసారి చేయడమే తప్పు అది రెండో సారి చేయడం నిజంగా పిచ్చితనమే అనేసరికి వేద చాలా బాధపడుతుంది. యష్ మాటలకు కన్నీళ్ళు పెట్టుకుంటుంది.


Also Read: ఊహించని నిర్ణయం తీసుకున్న మహేంద్ర- బెట్టు చేస్తున్న రిషిధార, బిక్కమొహం వేసిన చక్రపాణి


ఇంత మాట అనేశారు ఏంటి? విన్నీ చెప్పినట్టు మా ఇద్దరికీ సెకండ్ ఛాన్స్ లేదా? ఆయన మనసులో మళ్ళీ ప్రేమ పుట్టే అవకాశం లేదా అని వేద మనసులోనే బాధపడుతుంది. ఆ బఫూన్ గాడు భగ్నప్రేమికుడిలా ఉన్నాడు ప్రేమించిన అమ్మాయి వీడిని వదిలేసి వెళ్లిపోయిందని యష్ అనుకుంటాడు.