TGEAPCET-2025: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న టీజీఎప్‌సెట్-2025 పరీక్ష హాల్‌టికెట్లను జేఎన్‌టీయూహైదరాబాద్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే అగ్రికల్చర్‌, ఫార్మసీ హాల్‌టికెట్లతో పాటు ఇంజినీరింగ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలకాగా.. తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్‌టికెట్లను విడుదలచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది.. అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు తెలిపారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 29న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు రెండు సెషన్లలో; ఏప్రిల్ 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

అదేవిధంగా ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ పరీక్షను మే 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో అంటే, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 12 గంటలకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక రెండు విభాగాలకు కలిపి 253 మంది దరఖాస్తు చేసున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. 

పరీక్ష కేంద్రాలు..ఎప్‌సెట్ పరీక్షల నిర్వహణకోసం తెలంగాణతోపాటు ఏపీలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 16 పట్టణాలు/నగరాల్లో, ఏపీలో రెండు నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

పరీక్ష విధానం.. మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 

ఎప్‌సెట్-2025 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు..➥ బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్(ఫుడ్ టెక్నాలజీ(FT)) / బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (ఫారెస్ట్రీ) /బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ.➥  ఫార్మా-డి.➥ బీఎస్సీ(నర్సింగ్). 

ఆలస్యరుసుములో ఏప్రిల్ 24 వరకు అవకాశం..తెలంగాణ ఎప్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యరుసుముతో ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 18 వరకు రూ.2500 ఆలస్యరుసుముతో, ఏప్రిల్ 19 నుంచి 24 వరకు రూ.5000 ఆలస్యరుసుముతో దరఖాస్తులు సమర్పించవచ్చు.

పరీక్ష తేది (అగ్రి, ఫార్మా) పరీక్ష తేది (ఇంజినీరింగ్)

29-04-2025 - 30-04-2025.

02-05-2025 - 05-05-2025

TG EAPCET 2025 OFFICIAL WEBSITE