పహల్గాం: జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసే మనీశ్ రంజన్ అనే ఉద్యోగితో పాటు విశాఖపట్నం వాసి చంద్రబౌళి ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపి హత్య చేశారని సమాచారం.

మంగళవారం మధ్యాహ్నం బైసారన్ అనే కొండపై ఉన్న చెట్లు, పొదల నుంచి ఆయుధాలతో ఉగ్రవాదులు బయటకు వచ్చి, 40 మంది పర్యటకులను చుట్టుముట్టారు. విచక్షణారహితంగా వారిపై కాల్పులు జరిపి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన మందిలో ఇద్దరు విదేశీయులు ఉండగా, ఒకరు యూఏఈ, మరొకరు నేపాల్‌కు చెందినవారు, ఇద్దరు స్థానికులు ఉన్నారని ఓ అధికారి వివరాలను తెలిపారు.

పేరు, మతం అడిగి మరీ కాల్పులు జరిపిన ఉగ్రవాదులు 

ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టిన తరువాత వారి పేరు, మతం గురించి వివరాలు ఆరాతీసిన తరువాత కాల్పులు జరిపారని పర్యాటకులు కొందరు చెబుతున్నారు.  మంగళవారం ఉదయం పర్యటకులు సందర్శించడానికి వెళ్ళిన బైసారన్‌లో ఈ ఉగ్రదాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు పర్యటాకులను చుట్టుముట్టి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి బుల్లెట్ గాయాలయ్యాయని చెప్పారు.  

కాల్పులు మొదలైన వెంటనే పర్యాటకులు, స్థానికులు అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.. తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపారని.. అంతకుముందు వారు పర్యాటకులు అని ఉగ్రవాదులు తెలుసుకున్నారు. "నా భర్త నా పక్కనే నిల్చుని ఉన్నాడు. అప్పుడు ఒక ఉగ్రవాది) వచ్చి అతన్ని కాల్చి చంపాడు. వివరాలు, మతం అడిగిన తరువాత అతను అతను ముస్లిం కాదేమో అని అంటూనే కాల్చి చంపాడని ఓ మహిళా బాధితురాలు ఏబీపీ న్యూస్‌కు తెలిపారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి హత్యటెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులో మనీశ్ రంజన్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన మనీశ్ రంజన్‌ను ఆయన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు. ఐడీ కార్డు చూసి, వివరాలు అడిగి మరీ మనీశ్ రంజన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మనీశ్ స్వస్థలం బిహార్ కాగా, ఆయన హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. కుటుంబసభ్యులను వదిలిపెట్టి కేవలం మనీశ్ రంజన్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్య చేశారు. మొత్త ఉగ్రదాడుల్లో 28 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
 
 
 
దాడి వార్త బయటకు వచ్చిన వెంటనే, పహల్గాం రోడ్లు, వీధులు అంతా శూన్యంగా మారిపోయాయి. కశ్మీర్‌లో చాలా సంవత్సరాలుగా తీవ్రవాదం కొనసాగుతున్నప్పటికీ, ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటకం పెరుగుతోంది. కొన్ని రోజుల తరువాత జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.