జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ-హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) 'టీఎస్ పీజీఈసెట్' నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2 నుంచి 4 మధ్యలో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.250 ఆలస్య రుసుంతో మే 5 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.5,000 ఆలస్య రుసుంతో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పీజీఈసెట్ షెడ్యూలు ఇలా..
➥ పీజీసెట్ నోటిఫికేషన్: 28.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ (అపరాద రుసుము లేకుండా: 30.04.2023.
➥ రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 05.05.2023.
➥ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 10.05.2023.
➥ రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.05.2023.
➥ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 24.05.2023.
➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 21.05.2023 నుంచి.
➥ పరీక్ష తేదీలు: 29.05.2023 - 01.06.2023 వరకు.
Also Read:
టీఎస్ ఎంసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, మార్చి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ ఎంసెట్ పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు.
లాసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..