జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు. 


కోవిడ్-19 మహమ్మారి సమయంలో NTA టెస్ట్-ప్రాక్టీస్ సెంటర్‌లు మూసివేయడంతో, అభ్యర్థులు వారి ఇళ్ల నుంచే మాక్ టెస్టులు ప్రాక్టీసు చేసేందుకు వీలుగా ఎన్టీఏ ఈ యాప్‌ను ప్రారంభించింది. అభ్యర్థులు నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మాక్ టెస్ట్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ Google ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. iOS ప్లాట్‌ఫారమ్‌లలో కూడా యాప్ అందుబాటులో ఉంది. 


జేఈఈ మెయిన్ 2023 ఉచిత మాక్ టెస్ట్ ఇలా పొందండి..


స్టెప్ 1: విద్యార్థులు మొదటి తమ మొబైల్ ఫోనులో 'National Test Abhyas' యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.


స్టెప్ 2: రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ/ ఫోన్ నెంబరు, పాస్ వర్డ్ వివరాలు నమోదుచేసి లాగిన్ అవ్వాలి. 


స్టెప్ 3: స్క్రీన్ మీద వేర్వేరు పరీక్షలకు సంబంధించిన జాబితా కనిపిస్తుంది. 


స్టెప్ 3: అభ్యర్థులు తమకు మాక్ టెస్టు కోసం తమకు నచ్చిన టెస్టును ఎంపికచేసుకోవాలి. 


స్టెప్ 4: మాక్ టెస్టుకు రాయడానికి ముందు ఇచ్చిన నిబంధనలకు జాగ్రత్తగా పరిశీలించాలి. 


జేఈఈ మెయిన్ 2023 పరీక్షల షెడ్యూలు..
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జేఈఈ మెయిన్ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించనుంది. తొలి విడత పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో; రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షకు డిసెంబరు 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 


➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 


➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.


➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..