JEE Main 2027 Registration: ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జేఈఈ మెయిన్ 2027 మొదటి సెషన్ (జనవరి సెషన్) కోసం అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలోని టాప్ ఇంజినీరింగ్ ఇన్సిస్ట్యూట్స్ ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడానికి జేఈఈ మెయిన్ స్కోర్ అత్యంత కీలకం. జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి, ఐఐటీల్లో సీటు పొందాలనుకునే అభ్యర్థులకు జేఈఈ మెయిన్ పేపర్ 1 చాలా కీలకం. జనవరి సెషన్ విద్యార్థులకు మెరుగైన స్కోరు సాధించడానికి ముందస్తుగా అవకాశాన్ని అందిస్తుంది. NTA దరఖాస్తులు, పరీక్షలు, అడ్మిట్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను విడుదలయ్యాయి.
జేఈఈ మెయిన్ ముఖ్యమైన తేదీలు, షెడ్యూల్
- రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 24
- లేటు ఫీజు లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 22 (రాత్రి 11:50 గంటల వరకు)
- లేటు ఫీజుతో దరఖాస్తుల సమర్పణ: నవంబర్ 23 నుండి 26 వరకు
- అప్లికేషన్ సవరణ విండో : నవంబర్ 27 నుండి 29 వరకు
- ఎగ్జామ్ సిటీ ప్రకటన: డిసెంబర్ 30
- అడ్మిట్ కార్డుల విడుదల: జనవరి 13, 2027 నుంచి
- పరీక్ష తేదీలు: జనవరి 20, 21, 22, 23, 24, 28
పరీక్షా విధానం, షిఫ్టులు
- జేఈఈ మెయిన్ 2027 జనవరి సెషన్ ఎగ్జామ్‌ను రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు.
- ఫస్ట్ షిఫ్ట్: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (3 గంటలు)
- సెకండ్ షిఫ్ట్: మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు (3 గంటలు)
- B.Arch, B.Planning రెండూ రాసే విద్యార్థులకు పరీక్ష సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.
కోర్సులు, పేపర్లు
- పేపర్ 1: బీఈ / బీటెక్ కోర్సులు
- పేపర్ 2A: బి.ఆర్కిటెక్చర్
- పేపర్ 2B: బి.ప్లానింగ్
Also Read: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా NTA అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
- హోమ్‌పేజీలో 'JEE Main 2027 Session 1 Registration' లింక్‌పై క్లిక్ చేయాలి.
- వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత లాగిన్ అయి విద్యా వివరాలు, పరీక్షా కేంద్రాలు నమోదు చేయాలి.
- విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
- కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. Also Read: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
