AP Inter Exams Schedule | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి పి.రంజిత్ బాషా ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం ప్రథమ సంవత్సరం (Inter 1st Year) పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు నిర్వహిస్తారు. సెకండియర్ (Inter 2nd Year) పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు కొనసాగుతాయి.
ఎగ్జామ్ పేపర్లకు సంబంధించి ఇంటర్ బోర్డు పలు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. రెండో భాషా సబ్జెక్టు (పార్ట్-2) స్థానంలో అదనంగా ఎంపిక చేసుకునే గణితం, జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఆర్థికశాస్త్రం, సివిక్స్, కామర్స్ వంటి సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. బైపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా గణితాన్ని, ఎంపీసీ విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా జీవశాస్త్రాన్ని ఎంచుకున్న సందర్భాలలో కోర్, అదనపు సబ్జెక్టుల వారికి కలిపి ఒకే రకమైన ఎగ్జామ్ పేపర్ ఇస్తారు. గతంలో ఫెయిలైన అభ్యర్థులకు పాత సిలబస్ ఆధారంగానే ప్రశ్నపత్రాలు ఉంటాయని స్పష్టం చేశారు.
నైతికత, మానవ విలువల పరీక్షను జనవరి 27న, పర్యావరణ విద్య పరీక్షను జనవరి 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. సమగ్ర శిక్షా వృత్తి విద్య (ఎన్‌ఎస్‌క్యూఎఫ్ స్థాయి-4) థియరీ పరీక్షలను ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. థియరీ పరీక్షలకు ముందే ప్రాక్టికల్స్, ఇతర అనుబంధ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. వీటిని రోజుకు 2 విడతలుగా (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు) నిర్వహిస్తారు.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 24 - ఎలక్టివ్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళ్, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్
ఫిబ్రవరి 26 - ఇంగ్లీష్
మార్చి 1 - కోర్, అదనపు సబ్జెక్టులు (మ్యాథ్స్, సివిక్స్)
మార్చి 3 - జీవశాస్త్రం, చరిత్ర
మార్చి 5 - ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చి 9 - కెమిస్ట్రీ, కామర్స్
మార్చి 12 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
మార్చి 15 - మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
ఏపీ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్
ఫిబ్రవరి 25 - ఎలక్టివ్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు (తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పార్శీ, గణితం, చరిత్ర, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
ఫిబ్రవరి 27 - ఇంగ్లీష్
మార్చి 2 - కోర్, అదనపు సబ్జెక్టులు (మ్యాథ్స్, సివిక్స్)
మార్చి 4 - జీవశాస్త్రం, చరిత్ర
మార్చి 8 - ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చి 11 - కెమిస్ట్రీ, కామర్స్
మార్చి 13 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
మార్చి 16 - మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
