జేఈఈ మెయిన్‌ ( JEE MAIN ) తొలి విడత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పు చేస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ( NTA ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ తొలి విడత పరీక్షలను నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్షల తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులు విజ్ఞప్తి మేరకు ఎన్‌టిఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( NIT ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( JEE ) మెయిన్ – 2022 పరీక్షను నిర్వహిస్తున్నారు. 


పది పరీక్షలు అందుకే వాయిదా వేస్తారా?


ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బోర్డు పరీక్షల షెడ్యూల్ తారుమారైంది.  ఆయా రాష్ట్రాల్లోని బోర్డులు నిర్వహించనున్న పబ్లిక్‌ పరీక్షలకు, ఇంజనీరింగ్‌(Engineering) ప్రవేశ పరీక్షకు మధ్య తక్కువ సమయం, లేదా అసలు సమయం లభించకపోయే పరిస్థితి నెలకొంది. అందుకే గతంలో జేఈఈ(JEE) పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత  పలువురు విద్యార్థులు సోషల్‌ మీడియాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. విద్యార్థుల అభిప్రాయాలను పరిశీలించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA  ) ... చివరికి వాయిదా నిర్ణయం తీసుకుంది. 


జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్.. అర్హత నుంచి పరీక్ష వరకు తెలుసుకోవాల్సినవి ఇవే
 
మొదటి విడత జేఈఈ మెయిన్‌లో అవసరమైన మార్కులు సాధించలేని అభ్యర్థులు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలను రాయవచ్చు. తమ స్కోరును పెంచుకొనే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్‌ తుది విడత మే 24 నుంచి 29 తేదీల మధ్య జరగనుంది. ఓ అభ్యర్థి రెండు విడతల పరీక్షలను రాయాలనే నిబంధన లేదు. ఒకవేళ రెండు విడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ను అభ్యర్థి రాస్తే.. ఏ పరీక్షలో అయితే అభ్యర్థికి ఎక్కువ మార్కలు వస్తాయో, వాటినే ఎన్‌టీఏ పరిగణలోకి తీసుకొంటుంది. సాధారణంగా మొదటి రోజు బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో చేరేవారి కోసం పరీక్షలు ఉంటాయి. మిగిలిన రోజుల్లో బీటెక్‌ కోసం పరీక్షలు జరుపుతారుజేఈఈ  రివైజ్డ్ షెడ్యూల్... పూర్తి వివరాలను jeemain.nta.nic.in. వెబ్‌సైట్‌లో చూడవచ్చు.