జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చిన కటాఫ్ మార్కులు ఈసారి మాత్రం భారీగా పెరిగాయి. 2021లో 360 మార్కులకు కటాఫ్ 63 మార్కులుగా, 2022లో 360కి 55 మార్కులుగా ఉంది, అయితే ఈసారి కటాఫ్ మార్కులు ఏకంగా 86కు పెరగడం విశేషం. 2021, 22 సంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యార్థులు తగినంత ప్రతిభ చూపలేకపోయారని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి పరీక్ష కఠినంగా ఉందని భావించినప్పిటికీ.. అందుకు భిన్నంగా విద్యార్థలు మార్కులు సాధించారు.


గతానికి భిన్నంగా ఈసారి పోటీపడిన వారి సంఖ్య భారీగా పెరిగింది. అడ్వాన్స్‌డ్‌లో కూడా నెగ్గగలమన్న ధీమా కూడా విద్యార్థుల్లో పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఆత్మవిశ్వాసంతో పోటీపడ్డారు. దానికితోడు భౌతికశాస్త్రంలో ఈసారి 6 మార్కులు కలపడం కలిసొచ్చింది. ఈ ఏడాది కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను జనరల్-86, ఓబీసీ-77, ఈడబ్ల్యూఎస్-77, ఎస్సీ-43, ఎస్టీ-43గా నిర్ణయించారు.


ఐఐటీల్లో బీటెక్ సీట్ భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 4న జరిగి పరీక్షకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో 1,39,727 మంది అబ్బాయిలు ఉండగా.. 40,645 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 43,773 మంది అర్హత సాధించారు. వీరిలో అబ్బాయిలు 36,264 మంది, అమ్మాయిలు 7,509 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సిలింగ్‌కు అర్హత కల్పిస్తారు.


హైదరాబాద్ జోన్ విద్యార్థుల జోరు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి చిద్విలాస్ రెడ్డి టాపర్‌గా నిలిచారు. చిద్విలాస్ 360కి గాను 341 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచాడు. ఇక 298 మార్కులతో హైదరాబాద్ జోన్ కు చెందిన నాగ భవ్యశ్రీ బాలికల విభాగంలో ప్రధమ స్థానంలో నిలవడం విశేషం. భవ్యశ్రీ జాతీయ స్థాయిలో 56వ ర్యాంకులో నిలిచింది. టాప్ టెన్‌ ర్యాంకర్స్‌లో హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులు ఆరుగురు ఉండటం విశేషం. వావిలాల చిద్విలాస్ రెడ్డికి 1వ ర్యాంకు, రమేష్ సూర్య తేజకు 2వ ర్యాంకు, అడ్డగడ వెంకట శివరామ్‌కు 5వ ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరికి 7వ ర్యాంకు, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి 9వ ర్యాంకు, యక్కంటి పాణి వేంకట మనీంధర్ రెడ్డికి 10వ ర్యాంకు వచ్చింది.


జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..