తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 టీచర్లు, లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల పూర్తి షెడ్యూల్‌ను గురుకుల నియామక బోర్డు జూన్ 18న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1 నుంచి 22 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీఆర్‌టీ) నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు; రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు; ఇక మూడో సెషన్ పరీక్షలు సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 

పీజీటీ, డీఎల్‌, జేఎల్‌ పోస్టులకు పేపర్‌-1 పరీక్ష ఉమ్మడిగా ఉంటుంది. నార్మలైజేషన్‌ విధానంలో మార్కులు లెక్కించేందుకు అవకాశం లేకుండా కొన్ని సబ్జెక్టులు కలిపి వేర్వేరు సెషన్లలో పేపర్‌-1 పరీక్షలు నిర్వహిస్తారు. 

టీజీటీ, పీడీ స్కూల్స్‌, లైబ్రేరియన్‌ స్కూల్స్‌ పరీక్షకు ఇదే పద్దతిలో  పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి. గురుకుల పోస్టులకు పేపర్‌-1 పరీక్షలు అగస్టు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి.

ఆగస్టు 1 నుంచి 7 వరకు జేఎల్‌, డీఎల్‌, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్స్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పేపర్‌-2 పరీక్షలు ఉంటాయి. 

పేపర్‌-1 పరీక్షల అనంతరం ఆయా కేటగిరి పోస్టులకు షిఫ్టుల వారీగా పేపర్‌-3 పరీక్షలు నిర్వహిస్తారు. 

Website

పోస్టుల వివరాలు..

క్ర.సం. పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
2. జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్ డైరెక్టర్ 2008
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4020
5. లైబ్రేరియ‌న్ స్కూల్ 434
6. ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
7. డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
8. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
9. మ్యూజిక్ టీచ‌ర్స్ 124
  మొత్తం ఖాళీలు 9210

తెలంగాణ గురుకులాల్లో 9,210 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.

ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాతపరీక్షల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు.

ALSO READ:

తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా!
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎఎస్‌)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..