న్యూఢిల్లీ: మే 17న నిర్వహించిన JEE Advanced 2026 ఫలితాలు అర్ధరాత్రి విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా IITలు, NITలు, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశ ప్రక్రియ దీంతో ప్రారంభమైంది. అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 2 నుండి ప్రారంభమయ్యే JoSAA కౌన్సెలింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన కోర్సులు, కాలేజీలను ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులకు కీలకమైన అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇకపై జోసా కౌన్సెలింగ్ JoSAA Counselling 2026 ద్వారా ఐఐటీ (IIT), ఎన్‌ఐటీ (NIT), ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల ముందు సరైన కాలేజీ, సరైన బ్రాంచ్‌ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
టాపర్స్ వీరేజేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) ఫలితాలలో ఢిల్లీ జోన్ అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటింది. అడ్వాన్స్‌డ్ పరీక్షలో శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (AIR 1) సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచాడు. మరోవైపు, విద్యార్థినుల కేటగిరీలో ఆరోహి దేశ్‌పాండే అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది విడుదల చేసిన మెరిట్ జాబితాలో ఢిల్లీ జోన్ హవా కనిపించింది. ఇక్కడ టాప్ ర్యాంకులు సాధించిన పలువురు అభ్యర్థులు ఈ జోన్ నుంచే ఉన్నారు. ఇప్పుడు ఈ అభ్యర్థులతో పాటు వేలాది మంది విద్యార్థులు JoSAA Counselling ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రముఖ టెక్నికల్ కాలేజీలను ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేర్చనున్నారు.
జూన్ 2 నుండి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంజోసా కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2వ తేదీన ప్రారంభమవుతోంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తమకు నచ్చిన కాలేజీ, బ్రాంచ్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత దశల వారీగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.
IIT, NITలతో పాటు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం జోసా ద్వారా దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రభుత్వ నిధులు పొందే సాంకేతిక సంస్థలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా విద్యార్థులు అనేక కాలేజీలు, కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల ప్రవేశ ప్రక్రియ ఈజీ అవుతుంది.
చాయిస్ ఫిల్లింగ్‌లో తొందరపడొద్దుకౌన్సెలింగ్ సమయంలో చాయిస్ ఫిల్లింగ్ అత్యంత కీలకమైన దశ అని నిపుణులు తెలిపారు. విద్యార్థులు కేవలం పాపులర్ కాలేజీల వెంటే పడకుండా, తమ ఆసక్తి, కెరీర్ లక్ష్యాలు, బ్రాంచ్ భవిష్యత్తు అవకాశాలు, ప్లేస్‌మెంట్ రికార్డులను దృష్టిలో ఉంచుకుని ఆప్షన్లను ఫిల్ చేయాలని సూచించారు.
ఏఏటీ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభంఐఐటీలలో బి.ఆర్క్ (B.Arch.) కోర్సులో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై, జూన్ 2 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కేవలం JEE Advanced 2026 లో అర్హత సాధించిన వారు మాత్రమే దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
JoSAA Counselling 2026 కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?స్టెప్ 1: జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in ను సందర్శించాలి.
స్టెప్ 2: JEE Main లేదా JEE Advanced కి సంబంధించిన లాగిన్ వివరాల సహాయంతో లాగిన్ అవ్వండి.
స్టెప్ 3: మీ సమాచారం మరియు నోటిఫికేషన్‌లను చెక్ చేయాలి
స్టెప్ 4: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ (GFTI) సంస్థలను, బ్రాంచ్‌లను ఎంచుకోవాలి.
స్టెప్ 5: మీ ప్రాధాన్యత ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేసి, ఆ ఆప్షన్లను సేవ్ చేయాలి.
స్టెప్ 6: చివరి తేదీ కంటే ముందే మీ ఆప్షన్లను లాక్ చేయండి.
స్టెప్ 7: మాక్ సీట్ అలాట్‌మెంట్, సీట్ అలాట్‌మెంట్ ఫలితాల కోసం వెయిట్ చేయండి
స్టెప్ 8: సీటు కేటాయింపు తర్వాత Seat Acceptance Fee చెల్లించి, ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
