Telangana EDCET 2026 Results | హైదరాబాద్‌: తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి శనివారం (మే 30న) ఈ ఫలితాలను సంయుక్తంగా విడుదల చేశారు.తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండిClick Here To get TG EdCET Results  

Continues below advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌ పరీక్షకు మొత్తం 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్ష రాశారు. కాగా, హాజరైన వారిలో 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది పరీక్షలో రికార్డు స్థాయిలో 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలలో బాణోత్ అజిత్ సాయి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారని అధికారులు తెలిపారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) తరపున ఈ ఏడాది ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించడం తెలిసిందే. ఎడ్‌సెట్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in ద్వారా తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Continues below advertisement

Also Read: Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్

కౌన్సెలింగ్ ప్రక్రియ: ఎడ్‌సెట్ 2026 ఫలితాల విడుదల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ నెలలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎడ్‌సెట్ ఫలితాల విషయంలో ఎలాంటి రీ-ఇవాల్యుయేషన్ లేదా రీ-టోటలింగ్‌కు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ర్యాంకులలో సమాన మార్కులు వస్తే, వయస్సును బట్టి పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిసిందే.

Also Read: JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్