JEE Advanced 2024 Applcation Dates: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 పరీక్షకు సంబంధించి ఐఐటీ మద్రాస్ (IIT Madras) కీలక అప్‌డేట్ ఇచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి దరఖాస్తు తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు ప్రకటించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్‌(JEE Main)లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. దాన్ని ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు మార్చినట్లు తెలిపింది. దరఖాస్తు తేదీలు మాత్రమే మారాయని, పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకరం మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష యథాతథంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరుగనుంది.
 
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన రెండున్నరల లక్షల మంది విద్యార్థులకు ఏటా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తు్న్న సంగతి తెలిసిందే. కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్  పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (JEE Advanced 2024 Admit Card) మే 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. మే 26న పరీక్ష నిర్వహించి జూన్ 2న ప్రాథమిక కీ విడుల చేసి, జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 9న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు.


ఏప్రిల్ 25న జేఈఈ మెయిన్ ఫలితాలు..
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2 పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 12.57 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. ఇందులో 95 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌-2 పేపర్‌-1 పరీక్షలు ఏప్రిల్ 9తో ముగియగా, ఏప్రిల్ 12న పేపర్‌-2 (ఏ), పేపర్‌ 2(బీ) పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత రెస్సాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీలను విడుదలచేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. తొలి, తుది విడత పరీక్షల్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని  ఏప్రిల్‌ 25న ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించనుంది.


JEE Advanced 2024 ముఖ్యమైన తేదీలివే..


➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.04.2024 (10:00 IST)


➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 07.05.2024 (17:00 IST)


➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.05.2024 (17:00 IST)


➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్:  17.05.2024 (10:00 IST) - 26.05.2024 (14:30 IST)


➥ పీడబ్ల్యూడీ అభ్యర్థుల ద్వారా స్క్రైబ్‌ ఎంపిక (40% కంటే తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు రాయడంలో ఇబ్బంది ఉన్నవారు): 25.05.2024.


➥ JEE (Advanced) 2024 పరీక్ష తేది: 26.05.2024 (శనివారం)


    ⫸ పేపర్-1: 09:00-12:00 IST


    ⫸ పేపర్-2: 14:30-17:30 IST


➥ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో: 31.05.2024 (17:00 IST) నుండి


➥ JEE (Advanced) 2024 ప్రొవిజినల్ ఆన్సర్ కీ వెల్లడి: 02.06.2024 (10:00 IST)


➥ JEE (Advanced) 2024 ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.06.2024 (10:00 IST) - 03.06.2024 (17:00 IST)


➥  JEE (Advanced) 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ వెల్లడి: 09.06.2024 (10:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09.06.2024 (10:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 10.06.2024 (17:00 IST)


➥ జాయింట్ సీట్ అల్లొకేషన్ (JoSAA) 2024 ప్రక్రియ ప్రారంభం: 10.06.2024 (17:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 పరీక్ష తేది: 12.06.2024 (09:00 IST - 12:00 IST)


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఫలితాల వెల్లడి: 15.06.2024 (17:00 IST)


JEE (Advanced) 2024  Schedeule


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...