జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు సెప్టెంబరు 11న విడుదలయ్యాయి. ఐఐటీ బాంబే ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు/లేదా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలను చూసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్, ఇతర వివరాలను కూడా విడుదల చేసింది. ఫలితాలతోపాటు తుది ఆన్సర్ కీని కూడా విడుదల చేశారు.
JEE Advanced 2022 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
26.17 శాతం విద్యార్థులు మాత్రమే అర్హత..జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షలో మొత్తం 26.17 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు మొత్తం 1,60,038 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా.. 1,55,538 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 40,712 మంది విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది 30 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం 4 శాతం తగ్గింది. కటాఫ్ మార్కులను జనరల్ 88.41, ఈడబ్ల్యూఎస్ - 63.11, ఓబీసీ- 67, ఎస్సీ-43.08, ఎస్టీ-26.70 గా నిర్ణయించారు.
సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆర్కే శిశిర్ టాపర్‌గా నిలిచారు. శిశిర్ 360 మార్కులకు గానూ 314 మార్కులు సాధించారు. శిశిర్ ఐఐటీ బాంబే జోన్‌కు చెందినవారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జాతీయస్థాయి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తెలంగాణ ఎంసెట్‌లో మూడోర్యాంకు సాధించిన విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ జేఈఈ ఫలితాల్లో 6వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. వంగపల్లి సాయిసిద్దర్థ 4వ ర్యాంకు సాధించాడు. తెలంగాణకే చెందిన ధీరజ్ కురుకుండ 8వ ర్యాంకులో నిలిచాడు. టాప్-10లో 2, 3, 4, 6, 8 ర్యాంకులు మద్రాస్ జోన్‌కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకోవడం గమనార్హం.
Also Read: JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు ఇదే!
టాప్-10 ర్యాంకర్లు వీరే...
1. ఆర్.కె. శిశిర్ 2. పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (తెలంగాణ)3. థామస్ బిజు చీరంవెలిల్ 4. వంగపల్లి సాయి సిద్దార్థ (ఏపీ)5. మయాంక్ మోత్వానీ 6. పోలిశెట్టి కార్తికేయ (ఏపీ)7. ప్రతీక్ సాహూ 8. ధీరజ్ కురుకుండ (తెలంగాణ)9. మహిత్ గధివాలా 10. వెట్చా జ్ఞానమహేశ్
జాతీయస్థాయిలో కేటగిరీలవారీగా టాపర్లు జాబితా పరిశీలిస్తే.. మొత్తం 10 విద్యార్థులు టాప్-1 ర్యాంకు సాధించడం విశేషం. వీరిలో ఐఐటీ బాంబే జోన్‌లో నలుగురు, ఐఐటీ మద్రాస్ జోన్‌లో నలుగురు, ఐఐటీ ఢిల్లీ జోన్, ఐఐటీ గువాహటి జోన్ల పరిధిలో ఒక్కోక్కరి చొప్పున ఉన్నారు. కేటిగిరీలవారీగా టాప్-1 ర్యాంకు సాధించిన 10 మంది విద్యార్థులు వీరే..
1.ఆర్.కె. శిశిర్ (ఐఐటీ బాంబే)-CRL2. వంగపల్లి సాయి సిద్దార్థ (ఐఐటీ మద్రాస్)- OBC-NCL3. పొలిశెట్టి కార్తికేయ (ఐఐటీ మద్రాస్)- Gen-EWS4. దయ్యాల జాన్ జోసెఫ్(ఐఐటీ మద్రాస్)- SC5. లోవెశ్ మెహర్(ఐఐటీ ఢిల్లీ)-ST6. ఓజస్ మహేశ్వరీ (ఐఐటీ బాంబే)-Gen-PWD7. గైకోటి విగ్నేష్ (ఐఐటీ మద్రాస్) - Gen-EWS-PWD8. ఓంకార్ రమేశ్ సిర్పూర్ (ఐఐటీ బాంబే)-OBC-NCL-PWD9. ప్రకాశ్ ఎస్ రా థోడ్ (ఐఐటీ బాంబే)-SC-PWD10. తాడర్ సిమి (ఐఐటీ గువాహటి)-ST-PWD ఐఐటీ ఢిల్లీ జోన్ టాపర్లు:1. మయాంక్ మోత్వానీ - CRL 52. తనిష్క్ కాబ్రా - CRL 163. సాక్ష్యం రతీ - CRL 184. నవ్య - CRL 205. హర్షకుమార్ - CRL 21 ఐఐటీ బాంబే జోన్ టాపర్లు:1. ఆర్.కె. శిశిర్ - CRL 12. ప్రతీక్ సాహూ - CRL 73. మహిత్ గధివాలా - CRL 94. విశాల్ బైసానీ - CRL 135. హరిహంత్ వశిష్ట - CRL 17
ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్లు:1. పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి - AIR 22. థామస్ బిజు చీరంవెలిల్ - AIR 33. వంగపల్లి సాయిసిద్ధార్థ - AIR 44. పోలిశెట్టి కార్తికేయ - AIR 65. ధీరజ్ కురుకుండ - AIR 8
ఐఐటీ రూర్కీ జోన్ టాపర్లు: 1. CRL 19 - మ్రినాల్ గార్గ్ 2. CRL 29 - సౌమిత్రా గార్గ్ 3. CRL 38 - గౌరిష్ గార్గ్4. CRL 42 - చిన్మయ్ ఖోకర్ 5. CRL 48 - హర్ష్ జఖర్ ఐఐటీ భువనేశ్వర్ జోన్ టాపర్లు:1. వెట్చా జ్ఞాన మహేశ్ - AIR 102. దివ్యాంశు మాలు - AIR 113. సూర్యాన్స్ శ్రీజన్ - AIR 514. తనీష్ అగర్వాల్ - AIR 575. ఆదిత్యప్రకాశ్ - AIR 70
ఐఐటీ కాన్పూర్ జోన్ టాపర్లు:1. కనిష్క్ శర్మ - AIR 582. అతర్వ్ మోఘే - AIR 1703. కనక్ బర్ఫా - AIR 1894. అర్వింద్ కుమార్ యాదవ్ - AIR 1925. హర్షిత్ శ్రీవాత్సవ - AIR 215
ఐఐటీ గువాహటీ జోన్ టాపర్లు:1. అభిజిత్ ఆనంద్ - CRL 152. శివం సావర్న్ - CRL 653. ఆదిత్య అజయ్ - CRL 1884. హిమాన్షు శేఖర్ - 1935. పార్థివ్ సేన్ - 195
మహిళల విభాగంలో టాపర్లు..1. జలధి జోషి - CRL 322. తనిష్క కాబ్రా - CRL 163. స్నేహ పరీక్- CRL 4474. ప్రగతి అగర్వాల్ - CRL 5455. జాహ్నవి షా - CRL 2586. పల్లి జలజాక్షి - CRL 247. విధూషి - CRL 440