దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్‌వీ) ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2023ను ఏప్రిల్ 29న నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 21న విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు ఉంటాయి.
ALSO READ:
నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రవేశ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ, అర్హత వివరాలు ఇలా!
తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, కౌన్సెలింగ్ పూర్తి వివరాలు ఇలా!
జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) జూన్ 19న ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..