ప్రపంచ బ్యాంకు వచ్చే వేసవి కాలంలో నిర్వహించే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఇంటర్నషిప్ మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ.
అంతర్జాతీయ సంస్థతో పని చేసేందుకు ఇదో గొప్ప అవకాశంగా ప్రపంచబ్యాంకు చెబుతోంది. దీని వల్ల ఫైనాన్స్ రంగంలో మంచి అనుభవం వస్తుందని ప్రపంచబ్యాంకు వివరిస్తోంది.
ఎవరు అర్హులు అంటే
డిగ్రీ చేసి ఉండాలి.
రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం వాళ్లు పీజీ కానీ పీహెచ్‌డీ కానీ ఏదైనా చేస్తున్నా ఫర్వాలేదు.
ఆంగ్లం అనర్గళంగా మాట్లాడాలి. ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, అరబిక్, పోర్చుగీస్, చైనీస్ భాషల్లో ఏదైనా ఒకటి తెలిసిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వ్యవసాయం, పర్యావరణం, ఇంజినీరింగ్, అర్బన్ ప్లానింగ్, సహజవనరుల నిర్వహణ, ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి వంటి రంగాల్లో ఉంటుంది.
స్టైపండ్ ఎంతంటే?
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్లకు అవర్లీ బేస్ మీద సాలరీ ఇస్తుంది. అంతేనా రెండు లక్షలపైగా ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తుంది.
విద్యార్థులు మాత్రం తమ సొంతంగానే వసతి సౌకర్యాలు చూసుకోవాలి.
వాషింగ్టన్ డీసీ సహా ప్రపంచబ్యాంక్ ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉండాల్సి ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి నాలుగు వారాలు.
ఇంటర్న్‌షిప్ కోసం ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. 90నిమిషాల టైంలోనే అప్లికేషన్ పూర్తి చేయాలి.
రెజ్యూమెను, ఆసక్తి చెప్పే ధ్రువపత్రం, డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి.
ప్రతి డాక్యుమెంట్ 5ఎంబీకి మించకూడదు.
ఒకసారి సబ్‌మిట్ చేసిన అప్లికేషన్లు మళ్లీ తప్పులు సరిదిద్దేందుకు వీలుండదు.
అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన తర్వాత మెయిల్‌కు అప్లికేషన్ నెంబర్ వస్తుంది.
మీరు పేరు షార్ట్‌లిస్ట్ అయిన తర్వాత రిక్ట్రూటింగ్ మేనేజర్ మిమ్మల్ని సంప్రదిస్తారు.