పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్)- జనవరి 2023 సెషన్' అడ్మిట్ కార్డులను 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్' నవంబరు 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎయిమ్స్(న్యూఢిల్లీ), జిప్‌మర్(పుదుచ్చేరి), నిమ్‌హాన్స్(బెంగళూరు), పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), ఎస్‌సీటీఐఎంఎస్ టీ(తిరువనంతపురం)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో పీజీ (ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, ఎండీఎస్) సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఏడాది ఎయిమ్స్ ఢిల్లీ పరీక్ష నిర్వహించనుంది.


అడ్మిట్‌కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


Step 1: అడ్మిట్‌కార్డుల కోసం అభ్యర్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌ దర్శించాలి.- aiimsexams.ac.in


Step 2: హోంపేజీలో కనిపించే "Academic Courses" లింక్‌పై క్లిక్ చేయాలి.


Step 3: ఆ పేజీలో "INI CET (MD/MS/MCh(6yrs)/DM(6yrs))" లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 4: అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థి తన ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి 'submit' బటన్‌‌పై క్లిక్ చేయాలి.


Step 5: అభ్యర్థికి సంబంధించిన అడ్మిట్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది.


Step 6: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్  చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


అడ్మిట్ కార్డు కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం ఇలా..
➤ మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నలకు ఒకమార్కు.
➤ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు. 
➤ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. సింగిల్ కరెక్ట్ ఛాయిస్/మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. 
➤ పరీక్ష సమయం 3 గంటలు.


భారత్‌లో ఎయిమ్స్ సెంటర్లు: న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, నాగ్‌పుర్, పట్నా, రాయ్ పూర్, రిషికేశ్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్, కల్యాణి, బతిండా, గువాహటి, విజయ్‌పూర్, బిలాస్‌పూర్, మదురై, దర్భాంగా, కశ్మీర్, డియోఘర్, రాజ్‌కోట్, మనేతి, మణిపూర్, కర్ణాటక, బీబీనగర్, మంగళగిరి.


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


:: Also Read ::


క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..