ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)- పీజీ ప్రోగ్రామ్‌ ప్రో(పీజీపీ ప్రో)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఆంత్రప్రెన్యూర్స్‌కు ఉద్దేశించించిన ఈ ప్రోగ్రామ్‌ వ్యవధి 18 నెలలు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది వీకెండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌. ఇందులో ఫౌండేషన్‌ కోర్సులు, కోర్‌ కోర్సులు, అడ్వాన్స్‌డ్‌ కోర్సులు, స్పెషలైజేషన్‌ కోర్సులు ఉంటాయి. ఆల్టర్‌నేట్ వీకెండ్‌ తరగతులు నిర్వహిస్తారు.


అకడమిక్‌ ప్రతిభ, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం అయిదేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. సీఏ, ఐసీడబ్ల్యూఏఐ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు రూ.5,000 దరఖాస్తు ఫీజుగా చెల్లించి ఆన్‌లైన్ ద్వారా నవంబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.



కోర్సు వివరాలు...


* పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ (పీజీపీ ప్రో) - ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్


కోర్సు వ్యవధి: 18 నెలలు.


క్యాంపస్‌లు: హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు.


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం అయిదేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.5,000.


ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రతిభ, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా 


కోర్సు ఫీజు: రూ.30,46,000 + జీఎస్టీ. ఇందులో అడ్మిషన్ ఫీజు రూ.3,00,000; ట్యూషన్ ఫీజు రూ.26,86,000; లైబ్రరీ, ఆలమ్నీ, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.60,000 చెల్లించాలి. 


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2022.


Notification


Online Application


Website


Also Read:


NIFT 2023 Registration: 'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 5న NIFT-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..