ఈ వీకెండ్ లో చాలా తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. వాటిలో 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఒకటి. ఈ సినిమా ముందు నుంచీ ఏదొక రూపంలో సోషల్ మీడియాలో పాపులర్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో హీరో నందు, గుంటూరు టాకీస్ ఫేమ్ రష్మీ కలసి నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. వాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేశారు నెయిజన్స్. అయితే ఇప్పుడు ఈ 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇంతకీ ఆ వైరల్ అవుతోన్న వార్త ఏంటి అనే కదా మీ డౌట్.. అక్కడికే వస్తున్నా.. 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది బోర్డ్. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హీరో నందు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నారు. ఇంకేముంది.. మేమర్స్ పండగ చేసుకున్నారు. 'బొమ్మ బ్లాక్ బస్టర్' A సర్టిఫికెట్ ఇవ్వడం పై కొత్త కొత్తగా మీమ్స్ క్రియేట్ చేస్తూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. 


వెంకీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్..  ‘‘నాకు ఆ కూల్ డ్రింక్ నే కావాలి’’ అని అడిగినట్టు.. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకు "నేను ఆ సినిమానే చూస్తా" అని మీమ్ క్రియేట్ చేశారు. అలాగే భీమ్లా నాయక్ సినిమాలో రానా డైలాగ్ ఉందిగా.. అదేనండీ ‘‘నాయక్ నీ ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడ’’ అనే డైలాగ్ ను ఈ సినిమాకు అన్వయించి "నందు అన్నా నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ" అంటూ ఫన్నీ గా మేమ్స్ క్రియేట్ చేశారు. ఇలా ఒక్కటి కాదు చాలా రకాల మేమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన నెటిజన్స్ ఇప్పుడే ఇలా ఉంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 


'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా టీమ్ ముందు నుంచీ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. సినిమా టైటిల్ దగ్గర నుంచి మొన్నామధ్య జరిగిన ఈవెంట్ వరకూ అన్నీ కాంట్రవెర్సి గానే జరిగాయి. ఆ కార్యక్రమానికి హీరోయిన్ రష్మీ రాను అందని పెద్ద హంగామా చేశారు. తీరా అది ప్రమోషన్స్ వీడియో అని తెలియగానే ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా? అంటూ కామెంట్స్ చేశారు. తర్వాత హీరో నందు క్రికెటర్ హర్భజన్ సింగ్ తో ప్రమోషన్స్ వీడియో చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అదే బాటలో ఇప్పుడు సినిమాకు A సర్టిఫికెట్ రావడం కూడా ఈ సినిమా కు కలిసి వచ్చినట్టుంది. ఇక ఈ సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా తో అయినా హీరో నందు మంచి హిట్ అందుకుంటారేమో చూడాలి. మీరు కూడా ఆ మీమ్స్ చూస్తూ కాసేపు నవ్వేసుకోండి.