పంజాబ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి. బీఈ, బీటెక్ లేదా ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023/ 2022/ 2021లో అర్హత సాధించి ఉండాలి.
వివరాలు..
* ఎంటెక్ ప్రోగ్రాం
మొత్తం సీట్ల ఖాళీలు: 200 సీట్లు.
విభాగాలు: బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్.
అర్హత: బీఈ, బీటెక్ లేదా ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023/ 2022/ 2021లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 23.04.2023.
Also Read:
'టోఫెల్' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లేవారి ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యతను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) డిసెంబర్-2022/ జూన్-2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ-నెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో పాలిటెక్నిక్ విద్యార్థులకు 'షాక్'! బీటెక్‌లో ప్రవేశాలకు 'బ్రేక్'?
ఏపీలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. పాలిటెక్నిక్ తర్వాత ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాలనే కొత్త నిబంధన తీసుకురానుండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్త విధానం ప్రకారం మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసుకున్న తర్వాత, నాలుగో ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాల్సి వస్తుంది. దీంతో పాలిటెక్నిక్ ఇక నాలుగేళ్ల కోర్సుగా మారిపోతుంది. ఏటా పాలిటెక్నిక్ నుంచి 35 వేల మంది ఉత్తీర్ణత సాధిస్తుంటే వీరిలో 85 శాతం మంది ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈసెట్) ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందుతున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..