దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో కొలువుల కోలాహలం మొదలైంది. మొదటి విడతగా డిసెంబరు 1న ప్లేస్‌మెంట్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 15 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈసారి ఐఐటీల్లో ప్రాంగణ నియామకాలు సరికొత్త రికార్డును స్పష్టిస్తున్నాయి. జాబ్ ఆఫర్లు పెరగడమే కాకుండా వార్షిక వేతనం రూ.కోటి, ఆపై అందుకుంటున్న వారి సంఖ్యా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా ఉంటున్నట్లు ఐఐటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది మొదటి విడతలో 9వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రాంగణ నియమాకాల్లో ఉద్యోగాలు పొందారు. వీరిలో 160 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో కొలువులు పొందారు.
ఆఫర్లు ఇస్తున్న ముఖ్య సంస్థలివే: మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్, క్వాల్‌కమ్, ఒరాకిల్, ఎస్ఏసీ ల్యాబ్స్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్ & కం. ఓఎన్‌జీసీ, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్‌టీమైక్రోఎలక్ట్రానిక్స్, ఇతర సంస్థలు.
ఈసారి ఐఐటీల్లో ప్లేస్‌మెంట్లు ఇలా..
* ఐఐటీ ఢిల్లీలో 650 మంది కొలువులకు ఎంపికయ్యారు. అందులో 50 మంది రూ.కోటి వేతనం అందుకోనున్నారు. వారు దేశంలోనే పనిచేయనున్నారు. మరో 20 మందికి విదేశీ కొలువులకు ఎంపికయ్యారు.
* ఐఐటీ బాంబేలో డిసెంబరు 1న 46 కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 250 ఉద్యోగ ఆఫర్లకుగాను 175 మంది కొలువుల్లో చేరేందుకు అంగీకరించారు. ఈ ఏడాది వేతన ప్యాకేజీలో పెద్ద మార్పు లేదని ఐఐటీ బాంబే తెలిపింది. ఇంటర్న్‌షిప్ చేసిన 300 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆయా కంపెనీలు ఆఫర్లు ఇవ్వగా అందులో 175 మంది అంగీకారం తెలిపారు.
ఐఐటీ మద్రాస్‌లో డిసెంబరు 1న 445 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అందులో 25 మందికి వార్షిక వేతనం రూ.కోటి పైనే ఉంది. వీరికి స్వదేశంలోనే ఉద్యోగాలు దక్కగా.. 15 మందికి విదేశీ కొలువులు వరించాయి.
* ఐఐటీ ఖరగ్‌పుర్‌లో మొదటిరోజు 760 ఆఫర్లు దక్కాయి. అందులో 16 అంతర్జాతీయ ఆఫర్లు ఉన్నాయి. అంతర్జాతీయ కొలువులకు ఎంపికైన వారిలో అత్యధిక ప్యాకేజీ రూ.2.60 కోట్లు.
* ఐఐటీ వారణాసిలో ప్రాంగణ నియామకాల్లో రెండు రోజుల్లో 640 మంది ఎంపికయ్యారు. మొత్తం 173 కంపెనీలు పాల్గొన్నాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.1.20 కోట్లు. లభించిన వేతనాలు రూ.12 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉన్నాయి.
Also Read:
దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!
భారతదేశంలో దాదాపు 66% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. బీహార్, మిజోరాం రాష్ట్రాలు ఈ కోవలో మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. బీహార్‌లో 92%, మిజోరంలో 90% పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటర్నెట్ మాటే ఎరుగరు. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, మధ్యప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో 80-85% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?
IIT Job Placements: రెసిషన్ భయం ఓవైపు కమ్మేస్తుంటే... గ్లోబల్ కంపెనీలు మాత్రం రికార్డ్ రేంజ్ ఆఫర్లతో IITల ఎదుట క్యూ కట్టాయి. ప్రస్తుతం IITల్లో ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. తమకు పనికొస్తాడు అనుకున్న వాళ్లకు కోట్ల రూపాయల జీతం ఇస్తామంటూ ఊరిస్తున్నాయి. చేస్తున్నాయి. గతేడాది రికార్డులను తుడిచేస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.