దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే మరోసారి సత్తా చాటింది. ఈసారి ఏకంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పోటీపడి ప్రపంచంలోని టాప్‌-100 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇటీవల లండన్‌లో విడుదలైన క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ 2023లో ఐఐటీ బాంబే 281-300 ర్యాంకుల మధ్య నిలిచి భారత్‌లో అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా తమ గ్రాడ్యుయేట్ల ఉద్యోగిత ఆధారంగా ఐఐటీ బాంబే ప్రపంచంలోని టాప్‌-100 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఉద్యోగితతోపాటు సామాజిక స్పృహ, పర్యావరణ విభాగాల్లో ఐఐటీ బాంబేని భారత్‌లోని అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా నిర్ణయించారు.


ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే తర్వాత ఐఐటీ ఢిల్లీ (321-340), జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (361-380) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగిత, పర్యావరణ విభాగాల్లో ఐఐటీ ఢిల్లీకి; ఇక లింగ సమానత్వం, ఇతర అసమానతల తొలగింపులో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి ర్యాంకులు లభించాయి. కాంపిటీషన్‌ (పోటీ), అకడమిక్‌ ఫ్రీడం విభాగాల్లో ఢిల్లీ యూనివర్సిటీ భారత్‌లో నాలుగో ర్యాంకులో నిలిచింది.


కాలిఫోర్నియా వర్సిటీ ప్రపంచంలోనే టాప్‌..


ప్రపంచంలోని అత్యున్నత విద్యాసంస్థల జాబితాలో కాలిఫోర్నియా యూనివర్సిటీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆ తర్వాత టొరంటో యూనివర్సిటీ, బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకులను సాధించాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకొన్న మొత్తం యూనివర్సిటీల్లో 135 (19.2 శాతం) అమెరికన్‌ వర్సిటీలే కావడం, వీటిలో 30 వర్సిటీలు టాప్‌-100 జాబితాలో నిలవడం విశేషం.



:: Also Read ::


డిగ్రీ విద్యార్థులకు అలర్ట్, యూనివర్సిటీలకు కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌! షెడ్యూలు ఇదే!
తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించిన కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అక్టోబరు 26న విడుదల చేసింది. దీంతో యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూళ్లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించినట్లయింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌, పీజీలోని 1, 3 సెమిస్టర్లకు సంబంధించిన అకాడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించారు.
కామన్ క్యాలెండర్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



AISSEE-2023: సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి.
నోటిఫికేషన్, దరఖాస్తు, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..