గ్రూప్‌-1 503 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని అక్టోబరు 29న విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఆన్సర్ 'కీ'తో పాటు పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత 5 లేదా 7 రోజుల పాటు 'కీ'పై అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉంది. నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి తుది కీ, ఆ తర్వాత ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌ కోసం ఎంపిక చేయనున్నారు. 


గ్రూప్-1 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..


తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 16న 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష నిర్వహించిన ఎనిమిది పని దినాల్లో ప్రిలిమినరీ కీ విడుదలతో పాటు ఓఎంఆర్ పత్రాల ఇమేజ్ స్కానింగ్ పూర్తిచేస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. కాగా నిర్ణీత గడువులోగా ఆన్సర్ కీని ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. 


Also Read:  ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల 'పార్ట్-2' దరఖాస్తు షురూ! వెంటనే దరఖాస్తు చేసుకోండి!


అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా.. అభ్యర్థుల జవాబు పత్రాలన్నీ జిల్లాల నుంచి అక్టోబు 17న హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 18 నుంచి అభ్యర్థుల OMR పత్రాల ఇమేజ్ స్కానింగ్ ప్రారంభమైంది. కమిషన్ ముందుగా ప్రకటించినట్లుగా 8 పనిదినాల్లో ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో పండగ సెలవుల్ని మినహాయించారు. దీంతో అక్టోబరు 29 ఆన్సర్ కీ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి గడువులోగా అభ్యంతరాలు స్వీకరించి, తర్వాత ఫలితాలతోపాటు తుది ఆన్సర్ 'కీ'ని కమిషన్ విడుదల చేయనుంది.


Also Read:  నేషనల్ హౌసింగ్ బ్యాంకులో ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!


పరీక్షకు 75 శాతం హాజరు..
తెలంగాణలో అక్టోబరు 16న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 


Also Read:  ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100!


కటాఫ్ మార్కులు లేవు..
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు అక్టోబరు 17న స్పష్టత ఇచ్చారు. 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కేవలం  స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఇందులో ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.



మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..