తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, 2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎంఎస్సీతో పాటు సీఎస్‌ఐఆర్‌-జేఆర్‌ఎఫ్‌, యూజీసీ-జేఆర్‌ఎఫ్‌, గేట్‌ లేదా ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా నవంబరు 4 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


* పీహెచ్‌డీ ప్రోగ్రామ్


విభాగాలు: బయోలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, థియరిటికల్ ఫిజిక్స్.


అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీతో పాటు సీఎస్‌ఐఆర్‌-జేఆర్‌ఎఫ్‌, యూజీసీ-జేఆర్‌ఎఫ్‌, గేట్‌ లేదా ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.11.2023.


ఇంటర్వూ తేదీలు..


➥ బయోలాజికల్ సైన్సెస్: నవంబరు 3 లేదా 4వ వారం.


➥ కెమికల్ సైన్సెస్:  డిసెంబరు 4, 5 తేదీల్లో.


➥ ఫిజికల్ సైన్సెస్: డిసెంబరు 28 -30 వరకు.


➥  CAMRIE: నవంబరు 30. 


➥ CHPC: నవంబరు 21-22 తేదీల్లో. 


Notification


Online Application


Fee Payment


ALSO READ:


ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్‌) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


లక్నో- ఐఐఎంఎల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, వివరాలు ఇలా
లక్నోలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీ , సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే ఏడాది జనవరి 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. క్యాట్‌, గేట్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ పరీక్షల మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఐఐటీ ఢిల్లీలో పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్స్ - కోర్సుల వివరాలు ఇలా
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దిల్లీ- 2023-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రిసెర్చ్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సును అనుసరించి డిగ్రీ, పీజీ, గేట్/ సీఎస్‌ఐఆర్‌/యూజీసీ/నెట్‌/ఐకార్‌/ఐసీఎంఆర్‌/ డీఎస్‌టీ- ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్ తదితరాల్లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అక్టోబరు 27 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...