Top Management Institutes: టెక్నాలజీ విద్యతో పాటు ఎప్పుడూ బూమింగ్ లో ఉండే మరో కోర్సు మేనేజ్‌మెంట్. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు, గ్రూపులకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ఇందులో రకరకాల స్ట్రీమింగ్ లు ఉంటాయి. పేరున్న ఐటీ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదివిన వారు కూడా బిజినెస్ మేనేజ్‌మెంట్ తప్పకుండా చేస్తుంటారు. టెక్నాలజీపై ఎంత గ్రిప్ అవసరమో.. అంతే మేనేజ్‌మెంట్ వైపు కూడా ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే టెక్నాలజీ సంబంధిత కోర్సులు, ఉద్యోగ అనుభవంతో పాటు మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉన్న వారినే చాలా సంస్థలు ఉన్నత పదవులకు రిక్రూట్‌ చేసుకుంటాయి. అయితే మీరు కూడా మేనేజ్‌మెంట్ డిగ్రీ చేయాలని అనుకుంటుంటే.. భారత్‌ లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ కాలేజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్- NIRF 2023 ఆధారంగా టాప్ లో ఉన్న మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఏంటో చూద్దాం.


1. IIM అహ్మదాబాద్


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) అహ్మదాబాద్ దేశంలోని అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్. ఇది ప్రపంచంలోనే టాప్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలుస్తూ వస్తోంది. ఐఐఎం అహ్మదాబాద్ ఫుల్ టైం ఎంబీఏ ప్రోగ్రామ్, 2 సంవత్సరాల ఎంబీఏ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాములు సహా అనేక రకాల ఎంబీఏ ప్రోగ్రాములను అందిస్తోంది. NIRF ర్యాంకింగ్ లో 83.20 స్కోరులో టాప్ 1 ర్యాంకు సాధించింది.


2. IIM బెంగళూరు


దేశంలోని మరో అత్యుత్తమ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఐఐఎం బెంగళూరు. అద్భుతమైన టీచింగ్ ఫ్యాకల్టీ, పరిశ్రమలతో ఒప్పందంతో సాగే విద్య అందిస్తారు. NIRF ర్యాంకింగ్ లో 80.89 స్కోరు సాధించింది. టాప్ 2 లో నిలిచింది ఐఐఎం బెంగళూరు.


3. IIM కోజికోడ్


76.48 NIRF స్కోరుతో.. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు లాంటి అత్యుత్తమ విద్యాసంస్థల తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది ఐఐఎం కోజికోడ్. అద్భుతమైన కరికులమ్, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ తో కోజికోడ్ టాప్ 3 లో నిలిచింది.


4. IIM కలకత్తా


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా NIRF ర్యాంకింగ్ లో 75.53 స్కోరు సాధించింది టాప్ 4 గా నిలిచింది. ఐఐఎం కలకత్తా దేశ పురాతన విద్యా సంస్థల్లో ఒకటి. 


5. IIT ఢిల్లీ


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో టెక్నాలజీ కోర్సులతో పాటు మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తూ.. టాప్ ఐఐఎంలను సైతం వెనక్కి నెట్టి తన అద్భుతమైన విద్యా బోధనతో టాప్ 5 ప్లేసు అందుకుంది. NIRF ర్యాకింగ్ లో 74.14 స్కోరు సాధించింది.


Also Read: Computer Science Engineering: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యలో టాప్ 10 దేశాలు ఇవే


6. IIM లక్నో


ఐఐఎం లక్నో మరో ప్రఖ్యాత విద్యాసంస్థ. దేశంలోని మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ఐఐఎం లక్నో ఆరో స్థానంలో నిలిచింది. NIRF ర్యాంకింగ్ లో 74.11 స్కోరు సాధించి టాప్ 6 లో చోటు దక్కించుకుంది.


7. NITIE ముంబయి


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ముంబయి.. మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తూ ఐఐఎం విద్యాసంస్థలతో పోటీ పడుతూ టాప్ ర్యాంకింగ్ సాధించింది. NIRF ర్యాకింగ్ లో 71.99 స్కోరు సాధించింది టాప్ 7 చోటు దక్కించుకుంది. 


8. ఐఐఎం ఇండోర్


71.95 స్కోరుతో NIRF ర్యాంకింగ్ లో ఐఐఎం ఇండోర్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఐఐఎం విద్యాసంస్థ కూడా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటిగా ఉంటూ వస్తోంది.


9. XLRI


గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్- XLRI విద్యాసంస్థ ఐఐఎం లాంటి అత్యున్నత విద్యాసంస్థల సరసన నిలవడానికి కారణం తన ఎక్సెలెన్స్. అద్భుతమైన కరికులమ్, ఇండస్ట్రీ కనెక్టివ్ స్టడీస్.. గ్జేవియర్ ను ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా నిలిపాయి. NIRF ర్యాంకింగ్ లో 70.75 స్కోరు సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది.


10. IIT బాంబే


ఐఐటీ బాంబే NIRF ర్యాంకింగ్ లో 68.11 స్కోరు సాధించి టాప్ 10 లో చోటు దక్కించుకుంది. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial