ఇంజినీరింగ్, ఎంబీఏ, డిగ్రీ.. ఇలా ఏది పూర్తి చేసినా.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. రెజ్యూమ్ అనేది చాలా ముఖ్యం. అది ఇష్టం ఉన్నట్టు తయారు చేసి పంపిస్తే.. కనీసం ఆఫీస్ నుంచి కాల్ కూడా రాదు. ఇంకా ఇంటర్వ్యూకి ఏం వెళ్తారు. ఉండేది ఒకే పోస్టు కావచ్చు.. కానీ వచ్చే దరఖాస్తులు పదుల సంఖ్యలో ఉంటాయి. అప్పుడు మీ రెజ్యూమ్ అట్రాక్టివ్ గా కనిపిస్తే.. మీకే కదా మెుదట కాల్ వచ్చేది.  


మన గురించి మనం చెప్పుకునేదే రెజ్యూమ్. అది మీ గురించి మీరు డప్పు కొట్టుకోవడం ఏం కాదు. మీకున్న స్కిల్స్ ని కంపెనీకి తెలియజేయడం. చదువు, అభిరుచులు, మీకున్న నైపుణ్యాల గురించి చెప్పేదే రెజ్యూమ్. ఉద్యోగానికి ప్రయత్నించేప్పుడు ఎంత మంచి రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటే అంత మంచిది.  సింపుల్ గా ఉంటే చాలు. లేనిపోనివి యాడ్ చేసి.. ఆ తర్వాత తల నొప్పి తెచ్చుకోకండి.


ఈ అంశాలు చేర్చండి..
పాఠశాల నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు.. జీపీఏతో సహా ముఖ్య వివరాలు యాడ్ చేయండి. 


మీరు ఏమైనా.. కంప్యూటర్‌ కోర్సులు, టైపింగ్‌ వంటి నైపుణ్యాలు చేర్చండి.  తెలిసిన భాషలు, అభిరుచుల గురించి స్పష్టంగా అందులో చెప్పాలి. అలా అని పేరాలు పేరాలుగా చెప్పకండి. సింపుల్ గా తేల్చేస్తే చాలు. 


రెజ్యూమ్‌లో పేరు, చిరునామా, నగరం, రాష్ట్రం, ఫోన్ నంబర్, ఈమెయిల్‌తో సహా పూర్తి వివరాలు ఇవ్వండి. 


క్యాండిడేట్ చదువు నుంచి వ్యక్తిత్వం వరకు.. అన్ని తెలిసేలా చేసేదే రెజ్యూమ్. అందుకే అందరికంటే భిన్నంగా ఉండాలి. కానీ సింపుల్ గా ఉండాలి. చదువు, గ్రేడ్‌లు, ర్యాంక్‌లు, అకడామిక్‌ నైపుణ్యాలు, కాలేజీలో చదువుతోపాటు సాధించిన ఇతర ఘనతలు, కంప్యూటర్‌ నైపుణ్యాలు, ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్, మీకు ఇంట్రస్ట్ కలిగించే విషయాలు, ఫ్యుచర్ గోల్స్ లాంటి వివరాలు అందులో చేర్చాలి. చిన్నగా సింపుల్ గా చేరిస్తే సరిపోతుంది.  


కాలేజీలో డిబేట్లలో పాల్గొనడం, క్రీడలు, పూర్తి చేసిన ప్రాజెక్టులు కూడా చేర్చితే మంచిది. ఏదైనా కంపెనీలో చేసిన ఇంటర్న్‌షిప్‌లు, అక్కడ నేర్చుకున్న అంశాలను రెజ్యూమ్ లో పెట్టాలి. వర్క్‌షాప్‌లు, ఇండస్ట్రియల్‌ టూర్స్ ప్రస్తావించాలి. చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్, కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు, టెక్నాలజీ పరంగా అప్‌డేట్‌గా ఉన్నామన్న విషయాన్ని.. తెలిసేలా రెజ్యూమ్ ఉండాలి. ఇవన్నీ పెడితే.. రెజ్యూమ్ సరిపోతుందా అనుకోకండి.. ప్లాన్ చేసుకుని.. చిన్నగా మీ గురించి తెలిసేలా రాస్తే జరుగుతుంది. అలా అయితే కంపెనీ నుంచి మీకే మెుదటి కాల్ వస్తుంది.


Also Read: NEET 2021 Counselling: త్వరలో నీట్ కౌన్సెలింగ్.. ఎన్‌టీఏ తాజా నోటిఫికేషన్.. అభ్యర్థులు చేయాల్సిన పనులివే


Also Read: ISRO Online Course: ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. 12 రోజుల్లో మీ చేతిలో సర్టిఫికేట్ .. ఏం నేర్పిస్తారంటే.. 


Also Read: JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్ లో మార్పులు.. వివరాల కోసం ఇక్కడ చూడండి