హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందుతోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1వ తరగతి నుండి డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌లను అభ్యసించే పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించింది.
HDFC ECS స్కాలర్‌షిప్ పథకం కింద, వ్యక్తిగత/కుటుంబ సంక్షోభం లేదా ఏదైనా ఇతర ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు అయ్యే ఖర్చును భరించలేక, ఆగిపోయే ప్రమాదం ఉన్న విద్యార్థులకు వారి చదువుల కోసం రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందుతోంది. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన HDFC బ్యాంక్, తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ - ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ (ECS)లో భాగంగా ఈ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. బ్యాంక్ తన సామాజిక చొరవ - పరివర్తన్‌లో భాగంగా విద్య మరియు జీవనోపాధి శిక్షణ రంగంలో వివిధ ప్రాజెక్టులను చేపడుతోంది.
Also Read: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!
స్కాలర్‌షిప్ వివరాలు..
1) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ స్కూల్ ప్రోగ్రాం
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత.
స్కాలర్‌షిప్: 1-6వ తరగతి వరకు రూ.15000, 7-12వ తరగతి వరకు రూ.18000 చెల్లిస్తారు.
2) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్ చదువుతున్న వారు అర్హులు.
స్కాలర్‌షిప్: డిప్లొమా వారికి రూ.20000, అండర్ గ్రాడ్యుయేషన్ రూ.30000, ప్రొఫెషనల్ కోర్సులు-రూ.50000 చెల్లిస్తారు.
3) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ పీజీ ప్రోగ్రాం.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.
Also Read: పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?
స్కాలర్‌షిప్: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35000, ప్రొఫెషనల్ పీజీ కోర్సులు-రూ.75000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 31.08.2022.