Half days Schools in AP: ఏపీలో రేపటి నుంచి ఒంటిపూట బడులు, నెలరోజులపాటు తరగతులు

AP Half Day School: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. 1 నుంచి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు.

Continues below advertisement

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (మార్చి 18) నుంచి ఒంటిపూట బడులు (Half days Schools) ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. ఇక ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సి పల్‌, మోడల్‌స్కూల్స్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల మేనేజ్‌మెంట్‌లలో ఒంటిపూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు వర్తిస్తాయని తెలిపారు. అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపాటు 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Continues below advertisement

ఏప్రిల్ 6 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు..
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..

➥ ఏప్రిల్ 6 నుంచి 16 వరకు 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.  

➥ ఏప్రిల్ 6 నుంచి 18 వరకు 6 - 8 వ తరగతులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

➥ ఏప్రిల్ 19న కాంపొజిట్ కోర్సు విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 8, 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు; 6, 7వ తరగతులకు కేవలం ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.

ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

ఏప్రిల్ 6న: ఫస్ట్ లాంగ్వేజ్.

ఏప్రిల్ 8న: ఇంగ్లిష్ పార్ట్-ఎ.

ఏప్రిల్ 10న: ఇంగ్లిష్ పార్ట్-బి (టోఫెల్).

ఏప్రిల్ 12న: మ్యాథమెటిక్స్.

ఏప్రిల్ 13న: పర్యావరణ శాస్త్రం(ఈవీఎస్) (3, 4, 5వ తరగతులకు).

ఏప్రిల్ 15న: ఓపెన్ స్కూల్ (3, 4, 5వ తరగతులకు)

ఏప్రిల్ 16న: SLAS 2024 (గ్రేడ్-4 విద్యార్థులకు)

6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

ఏప్రిల్ 6న: ఫస్ట్ లాంగ్వేజ్.

ఏప్రిల్ 8న: సెకండ్ లాంగ్వేజ్.

ఏప్రిల్ 10న: ఇంగ్లిష్ పార్ట్-ఎ.

ఏప్రిల్ 12న: ఇంగ్లిష్ పార్ట్-బి (టోఫెల్).

ఏప్రిల్ 13న: మ్యాథమెటిక్స్.

ఏప్రిల్ 15న: జనరల్ సైన్స్/ఫిజికల్ సైన్స్ (3, 4, 5వ తరగతులకు)

ఏప్రిల్ 16న: బయోలాజికల్ సైన్స్.

ఏప్రిల్ 18న: సోషల్ స్టడీస్.

ఏప్రిల్ 19న: కాంపొజిట్ కోర్సు పరీక్ష. ఇందులో 8, 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు; 6, 7వ తరగతులకు కేవలం ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ మార్చి 18: ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్

➥ మార్చి 20: ఇంగ్లిష్

➥ మార్చి 22: తేదీ మ్యాథమెటిక్స్

➥ మార్చి 23: ఫిజికల్ సైన్స్

➥ మార్చి 26: బయాలజీ 

➥ మార్చి  27: సోషల్ స్టడీస్ పరీక్షలు

➥ మార్చి 28: మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 

➥ మార్చి 30:  ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola