Trending
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
AP 10th Exams 2025 | ఏపీలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎగ్జామ్ రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆర్టీసీ అవకాశం కల్పించింది.
AP 10th Class Exams | అమరావతి: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ (AP SSC Exams) కు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం (Free Bus) అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) యాజమాన్యం శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 17 నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3450 ఎగ్జామ్స్ సెంటర్స్ ఏర్పాటు చేయగా, సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు మన మిత్ర ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
హాల్ టికెట్ చూపిస్తే చాలు..
మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఏపీలో టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ (AP 10th Class Exams) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఇంటి నుంచి ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్లడానికి, పరీక్ష రాశాక తిరిగే ఇంటికి చేరుకునేందుకు సిటీ ఆర్డినరీ సర్వీసులు, ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు తమ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్ చూపిస్తే చాలని అధికారులు తెలిపారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు నడిపియాలా ఏర్పాట్లు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది.
SSC Public Examinations - 2025 Hall Tickets..
Download S.S.C (Regular) HallTickets
Download S.S.C (Private) HallTickets
Download S.S.C (OSSC) HallTickets
Download S.S.C (OSSC Private) HallTickets
Download S.S.C (Vocational) HallTickets
SSC Public Examinations - 2025 School Wise Hall Tickets
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్
- 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ - 9.30 నుంచి 12.45 వరకు
- 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 12.45 వరకు
- 19-03-2025 (బుధవారం) - సెకండ్ ల్యాంగ్వేజ్ - 9.30 నుంచి 12.45 వరకు
- 21-03-2025 (శుక్రవారం) - ఇంగ్లీష్ - 9.30 నుంచి 12.45 వరకు
- 22-03-2025 (శనివారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 11.15 వరకు
- 22-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
- 24-03-2025 (సోమవారం) - మ్యాథమేటిక్స్ - 9.30 నుంచి 12.45 వరకు
- 26-03-2025 (బుధవారం) - భౌతికశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
- 28-03-2025 (శుక్రవారం) - జీవశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
- 29-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
- 29-03-2025 (శనివారం) - SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 నుంచి 11.30 వరకు
- 31-03-2025 (సోమవారం) - సాంఘీక శాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు