గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు నిర్మాణ్, ఇన్‌వెస్కో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు సీనియర్ మేనేజర్ శ్రీనివాస్‌యాదవ్ జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండి, వయసు 18-30 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ యువత దరఖాస్తుకు అర్హులని తెలిపారు.
ఎంపికైనవారికి జావా, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌సీ, బూట్స్ ట్రాప్, పీహెచ్‌పీ, ఎంఎస్ ఆఫీస్, టాలీ ప్రైమ్, సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్ల నమోదుకు 94946 09001, 91009 81632 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ..
తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
* ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
ట్రేడ్‌లు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), మెకానిక్ మోటార్ వెహికల్, మౌల్డర్.
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.05.2023 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 31.05.1990 - 31.05.1995 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీకి సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి రిజిస్టర్డ్ పోస్టు లేదా లేదా వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో సమర్పించవచ్చు.
స్టైపెండ్: ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.06.2023.
Also Read:
టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ వైవా ద్వారా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నాగ్‌పూర్ ఎయిమ్స్‌లో 73 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..