FCRI Hyderabad BSc Admissions 2024: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమీపంలోని ములుగులో ఉన్న "ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Forest College and Research Institute(FCRI), Hyderabad at Mulugu)" నాలుగేళ్ల బీఎస్సీ(హానర్స్‌) ఫారెస్ట్రీ (B.Sc. Hons. Forestry) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌తోపాటు టీఎస్ ఎప్‌సెట్-2024 (TS EAPCET) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు ఈ కోర్సుకు అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 6న ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్న విద్యార్థులు జూన్‌ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 30న దరఖాస్తులు సవరించుకోవచ్చు. మొత్తం సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఇక పేమెంట్ కోటా కింద ప్రవేశాలు కోరువారు రూ.3000 ఫీజు చెల్లించాలి. ప్రవేశాలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 8074350866, 9666460939 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.


కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల తొలి మెరిట్ జాబితాను జులై 2న ప్రకటించి, జులై 8న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జులై 9న తొలివిడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు జులై 16లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థుల సీట్ల కేటాయింపు రెండో మెరిట్ జాబితాను జులై 20న ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు జులై 26లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక చివరగా అభ్యర్థుల సీట్ల కేటాయింపు మూడో మెరిట్ జాబితాను జులై 29న ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు ఆగస్టు 5లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని విడతలు పూర్తయిన తర్వాత పేమెంట్ కోటా అభ్యర్థుల జాబితాలను ఆగస్టు 12న ప్రకటించనున్నారు. విద్యార్థులకు ఆగస్టు 12 నుంచి ఓరియంటేషన్ తరగతులు ప్రారంభంకానున్నాయి. కళాశాలలో రిజిస్ట్రేషన్‌కు కూడా ఆగస్టు 12 చివరితేదీగా నిర్ణయించారు.


కోర్సు వివరాలు..


* బీఎస్సీ(హానర్స్) ఫారెస్ట్రీ ప్రవేశాలు - 2024


అర్హత: ఇంటర్ అర్హతతోపాటు ఎప్‌సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: తెలంగాణ ఎప్‌సెట్-2024 ర్యాంకు ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు.  


దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ కోటా కింద ప్రవేశాలు కోరువారు రూ.3000 ఫీజు చెల్లించాలి. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.06.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 27.06.2024. (5:00 PM)


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.06.2024.


➥ అభ్యర్థుల మెరిట్ జాబితా వెల్లడి: 02.07.2024.


➥ మొదటి విడత కౌన్సెలింగ్/ప్రవేశాలు (అన్ని కేటగిరీలు): 08.07.2024.


➥ మొదటివిడత సీట్ల కేటాయింపు: 09.07.2024.


➥ మొదటివిడత ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చివరితేది: 16.07.2024.


➥ సీట్ల కేటాయింపు రెండో జాబితా వెల్లడి: 20.07.2024.


➥ రెండో విడత ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చివరితేది: 26.07.2024.


➥ సీట్ల కేటాయింపు మూడో జాబితా వెల్లడి: 29.07.2024.


➥ రెండో విడత ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చివరితేది: 05.08.2024.


➥ పేమెంట్ కోటా తుది జాబితా ప్రకటన: 12.08.2024.


➥ ఓరియంటేషన్, రిజిస్ట్రేషన్: 12.08.2024.


Notification


Online Application


Website



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..