ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 3 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించాల్సి ఉండగా.. ఆగస్టు 7కి వాయిదా పడింది. దీంతో ఆలస్యమైన కౌన్సెలింగ్ ప్రక్రియతో టెన్షన్‌లో ఉన్న అభ్యర్థులు ఆగస్టు 7న ప్రారంభమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో కళాశాలలు ఎంపికచేసుకోవాలనుకున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 12 గంటలకే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించారు. అయితే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైన కాసేపటికే సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. త్వరలోనే సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఓ ప్రకటన (Web options will be enabled soon) విడుదల చేసింది.    


Website


వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్ ఆప్షన్ల నమోదుకోసం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆగస్టు 12 వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక వీరికి ఆగస్టు 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 


ఏఐసీటీఈ అనుమతిచ్చినా..  73 కళాశాల అనుమతులు నిలిపివేత
ఏపీ ప్రభుత్వం 73 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు నిలిపివేసింది. కౌన్సెలింగ్‌ జాబితా నుంచి కూడా ఆ కళాశాలలను తొలగించింది. ఏఐసీటీఈ 252 కళాశాలలకు అనుమతులిచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం 179 కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతించింది. దీనికి విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపు, ఇతరత్ర సేవల కింద చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను సదరు కళాశాలలు చెల్లించలేదని కారణంగా పేర్కొంది. వర్సిటీలు ఎలాంటి సేవలు అందించకుండానే ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాదాపు 50 కళాశాలలు హైకోర్టును గతంలోనే ఆశ్రయించాయి. వీటిలో 11 కళాశాలలను కౌన్సెలింగ్‌లో పెట్టాలని ఇప్పటికే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బోధనారుసుముల చెల్లింపు భారాన్ని తగ్గించుకునేందుకే అనుమతులు నిలిపివేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.


ఫీజులు నిర్ణయించడంలోనూ తికమక..
ఏపీలోని ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి కనీస ఫీజు రూ.43 వేలు, గరిష్ఠం రూ.77 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 220 ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఫీజులు నిర్ణయించగా 92 కళాశాలల్లో కనిష్ఠ ఫీజు రూ.43 వేలుగా ఉంది. గత నాలుగేళ్లుగా కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా హైకోర్టు ఆదేశాలతో రూ.8 వేలు పెరిగింది. అయితే ఫీజుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎక్కువ కళాశాలకు కనిష్ఠ ఫీజునే నిర్ణయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు గతేడాది రూ.60 వేల పైగా ఫీజుండగా.. ఈ ఏడాది రూ.43 వేలకు కుదించడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. 


ALSO READ:


ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ  హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..