తెలంగాణలో ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023-24 ఫలితాలు  మే 31న విడుదలయ్యాయి. మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షకు 8,383 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7,252 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో మొదటి విడతలో 1,347 మంది విద్యార్థులు మోటా అడ్మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 23 గురుకులాల్లో సీట్లు కేటాయించడం జరిగిందన్నారు.

ఈ సంద‌ర్భంగా సీట్లు సాధించిన విద్యార్థులకు స‌త్య‌వ‌తి రాథోడ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 1 నుంచి 10వ తేదీ లోపు ఆయా పాఠ‌శాల‌ల్లో చేరాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏకలవ్య విద్యాలయాల ఓఎస్‌డీ స్వర్ణలత, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్‌సీవో రాజ్యలక్ష్మి ,అకాడమిక్ ఓఎస్డి శ్రీనివాస్, మెహబూబా జిల్లా ఏకలవ్య విద్యాలయాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

వెబ్‌సైట్

ప్రవేశ పరీక్షలో టాప్-10 ర్యాంకర్లు వీరే..
ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో టాప్-10లో నిలిచిన విద్యార్థుల వివరాలను అందుబాటులో ఉంచారు..
వివరాలు ఇలా..

విద్యార్థి పేరు సాధించిన ర్యాంకు ప్రవేశం పొందిన
ఏకలవ్య గురుకుల పాఠశాల
కిరణ్ కుమార్  1వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - సింగరేణి
హలావత్ ఉమేష్ చంద్ర  2వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - బయ్యారం
పార్ధసారధి 3వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - సింగరేణి
గుగులోతు ప్రియనందిని  4వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ -  సింగరేణి
అనిల్ నాయక్ 5వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - పాల్వంచ
సంపంగి ప్రవీణ్ కుమార్  6వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - ఉట్నూరు
ఎల్ శ్రీజ  7వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - సిర్పూర్-టి
దేవదత్తు  8వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - పాల్వంచ
నవీన్ 9వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - సింగరేణి
డేవిడ్ రాజు  10వ ర్యాంకు ఈఎంఆర్‌ఎస్ - సింగరేణి

Also Read:

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సోసైటీల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మే 29న విడుదల చేశారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు 1.21 లక్షల మందికిపైగా విద్యార్థులు చేసుకున్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

బీసీ గురుకుల ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు విడుదల చేశారు. ఫలితాలను బీసీ గురుకుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 1 నుంచి 10లోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..