ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. నీట్‌(యూజీ)-2023 అర్హత సాధించిన అభ్యర్థులు జులై 26న సాయంత్రం 6 గంటల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.


వివరాలు..


* ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు - కాంపిటెంట్ అథారిటీ కోటా


అర్హత: ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నీట్‌ యూజీ-2023 ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 


నీట్‌ కటాఫ్ మార్కులు కేటగిరీలవారీగా ఇలా..


➥ జనరల్‌ (ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌) - 137 మార్కులు (50 పర్సంటైల్).


➥ ఎస్సీ/ఎస్టీ/బీసీ, ఎస్సీ/బీసీ (దివ్యాంగులు) - 107 మార్కులు (40 పర్సంటైల్).


➥  ఎస్టీ(దివ్యాంగులు)- 108 మార్కులు (40 పర్సంటైల్).


➥ ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌(దివ్యాంగులు): 121 మార్కులు (45 పర్సంటైల్).


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2360 చెల్లించాలి. దీనికి బ్యాంకు ఛార్జీలు అదనం. డెబిట్‌ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్‌బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 


ఎంపిక విధానం: నీట్ యూజీ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా.


అవసరమయ్యే డాక్యుమెంట్లు..



  • ఆధార్ కార్డు

  • నీట్ యూజీ 2023 ర్యాంకు కార్డు

  • పదోతరగతి మార్కుల మెమో (పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)

  • ఇంటర్ లేదా తత్సమాన అర్హత మార్కుల మెమో (క్వాలిఫైయింగ్ ఎగ్జామ్)

  • 6 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు

  • ఇంటర్ లేదా తత్సమాన స్టడీ సర్టిఫికేట్

  • ఇంటర్ లేదా తత్సమాన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (ఇంటర్ టీసీ)

  • క్యాస్ట్ సర్టిఫికేట్

  • మైనార్టీ సర్టిఫికేట్ (ముస్లిమ్స్ మాత్రమే)

  • ఇన్‌కమ్ సర్టిఫికేట్-ఈడబ్ల్యూఎస్ (01.04.2023) తర్వాత జారీచేసినదై ఉండాలి.

  • తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికేట్/ తెల్లరేషన్ కార్డు

  • దివ్యాంగులైతే PwBD సర్టిఫికేట్

  • NCC సర్టిఫికేట్

  • క్యాప్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)

  • స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)

  • పోలీస్ మార్టైర్ చిల్డ్రన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)

  • ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)

  • భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)

  • రెసిడెన్స్ సర్టిఫికేట్(నాన్‌లోకల్ అభ్యర్థులకు)

  • లోకల్ స్టేటస్ సర్టిఫికేట్

  • అభ్యర్థుల పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సంతకం ఫొటో


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 20.07.2023. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 26.07.2023.


Notification


Prospectus


Online Application


Website


ALSO READ:


జులై 24 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తికాగా, జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. మొద‌టి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల‌ు జులై 23లోగా సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం జులై 24 నుంచి రెండో విడత  కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. విద్యార్థులు జులై 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించి, స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలి. వీరికి జులై 26న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial