విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని నర్సింగ్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌తో పాటు నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన జీఎన్‌ఎం కోర్సులో ఉత్తీర్ణులై అర్హులైన అభ్యర్థులు కోర్సుకు అర్హులు. సరైన అర్హతున్నవారు ఆగస్టు 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు వివరాలు..
* పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సు
వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌తో పాటు నర్సింగ్ కౌన్సిల్ గుర్తించిన జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.2360, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులకు రూ.1888.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వాారా.
ఎంపిక విధానం: జీఎన్‌ఎం మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.07.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.08.2023.
ALSO READ:
ఎంబీబీఎస్, బీడీఎస్ స్కౌట్స్ & గైడ్స్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన
ఏపీలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు స్కౌట్స్ & గైడ్స్ కోటా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ జులై 29న విడుదల చేసింది. ఈ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 1న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఆగస్టు 1న ఉదయం 11 గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ను అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ నోటిఫికేషన్‌లోనే పొందుపరిచింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఆగస్టు 9 నుంచి నీట్ యూజీ రెండో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2023 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 9 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 14 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 మధ్య ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. ఆగస్టు 16, 17 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, ఆగస్టు 18న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 19న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 28 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 31 నుంచి నీట్ యూజీ మూడో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2023 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 4 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు సెప్టెంబరు 1 నుంచి 5 వరకు ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 6, 7 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 8న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు సెప్టెంబరు 9న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు సెప్టెంబరు 10 నుంచి సెప్టెంబరు 18 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మిగిలిపోయిన సీట్లకు స్ట్రే వేకెన్సీ రౌండ్...
మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. సెప్టెంబరు 21 నుంచి 23 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 22 నుంచి 24 మధ్య ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 25న సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 26న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 27 నుంచి సెప్టెంబరు 30 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..