ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను డా.బీఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గతంలో ఇచ్చిన గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మార్చి 25న ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 189 ఎస్సీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ గడువు మార్చి 24తో ముగియగా, ఆ గడువును మార్చి 31 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఆన్‌‌లైన్‌ ద్వారా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు.


ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలోకి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులు. 5వ తరగతిలోకి ప్రవేశం కోరే విద్యార్థులు అనే వెబ్‌‌సైట్‌ ద్వారా, అలాగే ఇంటర్‌‌లో ప్రవేశం కోరే విద్యార్థులు అనే వెబ్‌‌సైట్‌ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 31వ తేదీ లోపుగా సమర్పించాలని నాగార్జున కోరారు. గురుకుల సీట్ల కేటాయింపులో ఎస్సీ ఎస్సీలకు 75 శాతం, బీసీ-సీ కేటగిరీకి చెందిన క్రిస్టియన్‌ దళితులకు 12శాతం, ఎసటీలకు 7శాతం, బీసీలకు 6 శాతం, ఓసీలకు 2శాతం రిజర్వేషన్లప్రకారంగా కేటాయించడం జరుగుతుందని వివరించారు.


వివరాలు...


* 5వ తరగతి ప్రవేశాలు


సీట్ల సంఖ్య: 14,940.


సీట్ల కేటాయింపు: ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. ప్రత్యేక కేటగిరీ కింద 15%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు.


అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2022-23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థులు కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.


వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2014 మధ్య; ఓసీ, బీసీ, బీసీ-సి విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 


నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


* ఇంటర్ ప్రవేశాలు


సీట్ల సంఖ్య: 13,970.


ఇంటర్ గ్రూప్, సీట్లు: ఎంపీసీ- 5,650, బైపీసీ- 5,560, ఎంఈసీ- 800, సీఈసీ- 1600, హెచ్ఈసీ- 360.


అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.


వయోపరిమితి: 31.08.2023 నాటికి 17 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.


పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 25, ఫిజికల్ సైన్స్- 15, బయాలజీ- 15, సోషల్ స్టడీస్- 15, ఇంగ్లిష్- 15, లాజికల్ రీజనింగ్- 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.


నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


Website


Also Read:


తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!


కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..