డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. విద్యార్థుల సౌకర్యార్థం మరో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌ రేడియో, మొబైల్‌ యాప్‌ సర్వీసులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సీతారామారావు, సీసీఎల్‌ఏ నవీన్‌మిట్టల్‌ సోమవారం ప్రారంభించారు. ఈ రెండు రకాల సేవల వల్ల వర్సిటీ సమాచారాన్ని విద్యార్థులు ఎప్పుటికప్పుడు తెలుసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని నవీన్‌మిట్టల్‌ చెప్పారు. 


వర్సిటీ వీసీ సీతారామారావు మాట్లాడుతూ.. ఇన్‌ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని విస్తృతంగా అందించేందుకు వర్సిటీ కృషి చేస్తోందని వివరించారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పాఠాలు వినే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందన్నారు. మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు అన్ని నోటిఫికేషన్ల వివరాలు, అడ్మిషన్ల వివరాలు, ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వెబ్‌ రేడియోను www.braou.ac.in ద్వారా లాగిన్‌ కావచ్చని వీసీ తెలిపారు.


ALSO READ:


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు - వివరాలు ఇలా!
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో పీజీ కోర్సులు, వివరాలు ఇలా!
శ్రీకాకుళంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ, బొల్లినేని మెడ్‌స్కిల్స్ సహకారంతో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి మెడికల్ డిగ్రీతోపాటు సాధారణ డిగ్రీ ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ సప్లిమెంటరీ విద్యార్థులకు మరో అవకాశం, సీఎస్‌ఏబీ కీలక నిర్ణయం!
జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా.. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు రానివారికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లభించదు. ఇలాంటివారి కోసం జోసా కౌన్సెలింగ్‌ నిర్వహణకు అధికారులు ఓ అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, 75 శాతంలోపు మార్కులు వచ్చినవారు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మార్కులు పెంచుకుంటే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు లభిస్తుంది. జోసా కౌన్సెలింగ్‌కు హాజరైనప్పుడుగానీ, ప్రవేశాల సందర్భంలో గానీ  మార్కుల జాబితా సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌ పరీక్షల సమయంలో అనారోగ్యం, ఇతర కారణాలతో సరిగా పరీక్ష రాయలేక తక్కువ మార్కులు పొందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial