ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగాను 5వ తరగతి, 11వ తరగతితలో ప్రవేశాలకు ఏప్రిల్ 23న నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. విద్యార్థుల ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రవేశపరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఆధార్ కార్డు నెంబరు, పుట్టినతేది, ఫోన్ నెంబరు వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
5వ తరగతి ప్రవేశపరీక్ష ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ ప్రవేశపరీక్ష ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..
* అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతిలో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు 75%, బీసీ-సి12%, ఎస్టీ-6%, బీసీ-5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. ప్రత్యేక కేటగిరీ కింద 15%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు.
* అంబేద్కర్ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొత్తం 13,970 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రూపులవారీగా ఎంపీసీ-5,650 సీట్లు; బైపీసీ-5,560 సీట్లు, ఎంఈసీ- 800 సీట్లు, సీఈసీ-1600 సీట్లు, హెచ్ఈసీ-360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అంబేద్కర్ గురుకులాలకు ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 189 గురుకుల పాఠశాలల్లో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని 167 జూనియర్ కాలేజీల్లో మొత్తం 13,970 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ ఈఏపీసెట్ 2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న 'ఏపీ ఈఏపీసెట్' 2023 పరీక్ష హాల్‌టికెట్లను మే 9న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్, స్కాన్డ్ కాపీలను అనుమతించరు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు.
సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..