ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కథానాయకుడిగా  రూపొందుతున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా (Ustaad Bhagat Singh Movie) ఒకటి. పవన్ వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 11వ తేదీకి 'గబ్బర్ సింగ్' విడుదలై 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఆ రోజు గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 


సోనీ చేతికి 'ఉస్తాద్...' ఆడియో
ఉస్తాద్ భగత్ సింగ్' ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ ప్రముఖ కంపెనీ సోనీ సొంతం చేసుకుంది. సోనీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానల్ లో ఈ సినిమా పాటలను ప్రేక్షకులు వినొచ్చు. అదీ విడుదలైన తర్వాతే అనుకోండి!


'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లింప్స్ అదిరిపోతుందని ఆల్రెడీ డీఎస్పీ అప్డేట్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.  


Also Read : 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?






సంధ్యలో 'ఉస్తాద్...' గ్లింప్స్ ఫంక్షన్!   
Ustaad Bhagat Singh First Glimpse : మే 11న హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 35 ఎంఎం థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 4.59 గంటలకు గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 



'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఓ కథానాయికగా శ్రీ లీల నటిస్తున్నారు. మరో కథానాయికకు కూడా సినిమాలో చోటు ఉందని సమాచారం. ఇంకా ఆ పాత్రకు ఎవరినీ ఎంపిక చేయలేదని తెలిసింది. త్వరలో ఎంపిక చేస్తారట. ఆ మధ్య హైదరాబాదులో ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. అందులో కథానాయిక శ్రీలీల (Sreeleela) కూడా పాల్గొన్నారు. హీరో హీరోయిన్లతో కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ ఫైట్ తెరకెక్కించారు. ఆ తర్వాత హరీష్ శంకర్ డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు.


Also Read 'విరూపాక్ష' విజయంతో సత్యం రాజేష్ రెండో 'పొలిమేర'కు పెరిగిన క్రేజ్!
 
స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్ - లక్ష్మణ్ (Ram Laxman Masters) నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసినట్లు 'ఉస్తాద్ భగత్ సింగ్' యూనిట్ తెలియజేసింది. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... హై వోల్టేజ్ భారీ యాక్షన్ సీన్లు తీశారు. అవి సినిమాలో హైలైట్ అవుతాయట!


పవన్...  స్పెల్ బైండింగ్ మ్యానరిజమ్!
పవన్ కళ్యాణ్ అంటే ఆయన మేనరిజమ్స్ కూడా అభిమానులకు గుర్తుకు వస్తాయి. హరీష్ శంకర్ సైతం పవర్ స్టార్ ఫ్యాన్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'లో స్పెషల్ మేనరిజమ్స్ క్రియేట్ చేశారట. అదిరిపోయే డైలాగ్స్, స్పెల్ల్ బైండింగ్ మ్యానరిజంలతో పవన్ కళ్యాణ్‌ ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.