తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్ల భర్తీకి నిర్వహించిన 'దోస్త్‌' స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా మరో 6,843 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌రు 30లోపు సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్‌ సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేయాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి సూచించారు. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 1,96,386 మంది విద్యార్లు సీట్లు పొందారని. తాజా రౌండ్‌తో కలిపి మొత్తం ప్రవేశాల సంఖ్య 2 లక్షలు దాటుతుందని ఆయన తెలిపారు.


స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ సెప్టెంబర్‌ 21 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.


➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్‌ 21 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నారు


➥ సెప్టెంబర్‌ 29న సీట్ల కేటాయింపు జరిగింది.


➥ సీట్లుపొందినవారు సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్, కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్‌ చేయాలి.


స్పాట్‌ ప్రవేశాలు..
ఇక దోస్త్ పరిధిలోని ఆయా కళాశాలలు అక్టోబరు 3, 4 తేదీల్లో స్పాట్‌ ప్రవేశాలు జరుపుకోవచ్చని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 


రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సులకు సంబంధించి మొత్తం 4,73,214 సీట్లు ప్రతీ ఏటా ఉండేవి. అయితే ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు, మరికొన్ని కాలేజీల్లో 15 శాతం లోపే ప్రవేశాలు జరిగేవి. దీంతో కాలేజీలు కోర్సులను నడపలేకపోతున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టి 86,670 సీట్లను గతేడాదిలోనే ఫ్రీజ్‌ చేశారు. 


'దోస్త్' నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌, ఈ ఏడాది నుంచే అమలు
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్‌ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు నిర్ణీత నమూనాలో రూ.200 విలువచేసే నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్ ఇవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...