Brahmamudi Serial September 30th Episode:  రాజ్ వాళ్ళు కనకం పంపించిన లొకేషన్ కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్ లో రాహుల్ ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసరికి రుద్రాణి అప్పుడే ఏంటని అంటుంది. బ్లడ్ లాస్ వల్ల నీరసంగా ఉంటుందని చెప్తాడు. ఇక రాహుల్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంజెక్షన్ వేసుకోనని గోల చేస్తున్నాడని నర్స్ వచ్చి చెప్తుంది. శుభాష్ ముందు స్వప్న కోసం ఆరాటపడుతున్నట్టు గొడవ చేస్తాడు. రాజ్ వాళ్ళు స్వప్న కోసం వెళ్లారు, పోలీసులు కూడా వెతుకుతున్నారు గొడవ చేయవద్దని శుభాష్ చెప్తాడు. జీవితాంతం స్వప్న కోసం అందరూ వెతుకుతూనే ఉండాలని రాహుల్ అనుకుంటాడు. కనకం మైఖేల్ దగ్గర కూర్చుని రాజ్ వాళ్ళు వచ్చే వరకు టైమ్ వెస్ట్ చేయాలని ఏవేవో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తుంది. మైఖేల్ ని వయసు అడిగి బాగా ముదిరిపోయావ్ నీకు దోషం ఉందని చెప్పి ముదురు బెండకాయ తీసుకొచ్చి ముందు పెళ్లి చేద్దామని అంటుంది. బెండకాయ తెప్పించి దానికి తాళి కట్టిస్తుంది. మీరు చెప్పినట్టే చేశాను కదా ఇప్పుడు స్వప్నకి తాళి కట్టవచ్చా అంటుంది. రాజ్ వాళ్ళు ఇంకా రాలేదు ఏంటని టెన్షన్ గా ఎదురుచూస్తూ ఉంటుంది.


ALso Read: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!


రాజ్, కావ్య రావడం చూసి కనకం సంతోషపడుతుంది. మైఖేల్ స్వప్న మెడలో తాళి కట్టబోతుంటే కనకం ఆగు అంటుంది. అక్కడ రాజ్ వాళ్ళని చూసి మైఖేల్ షాక్ అయి తాళి వదిలేస్తాడు. రాహుల్ ఎలా ఉన్నాడని స్వప్న ఆరాటంగా అడుగుతుంది. రాజ్ ని చూసి మైఖేల్ బిక్క మొహం వేస్తాడు. లాస్ట్ టైమ్ వదిలేశాను ఇప్పుడు ఏం చేయాలని అంటే కొట్టొద్దని బతిమలాడుకుంటాడు. పోలీసులు వచ్చి మైఖేల్ ని పట్టుకుని పోతారు. ఎవరికి తెలియకుండా ప్లాన్ చేసినా ఎలా వచ్చారని మైఖేల్ అడుగుతాడు. అప్పుడే కనకం తను స్వప్నకి తల్లినని చెప్తుంది.  వీడియో కాల్ చేసి పట్టించానని చెప్పేసరికి బిత్తరపోతాడు.


కావ్య: వీడిని చూస్తుంటే ఎవరో వీడి వెనుక ఉన్నారో అనిపిస్తుంది


మైఖేల్: నా వెనుక ఎవరు ఉంటారు మేడమ్


వాడిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. సమయానికి వచ్చి తన కూతుర్ని కాపాడినందుకు కనకం కృతజ్ఞతలు చెప్తుంది. రాహుల్ ఇంటికి వచ్చిన తర్వాత అందరి ముందు డ్రామా మొదలు పెడతాడు.


రుద్రాణి: స్వప్న దూరమైతే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను


రాహుల్: నా స్వప్నని కళ్ల ముందే ఎత్తుకుపోతుంటే చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు తను ఎక్కడ ఉందో ఎలా ఉందో


శుభాష్: నువ్వు జాగ్రత్తగా ఉండి ఉంటే ఇప్పుడు తనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినది. లైఫ్ ని సీరియస్ గా తీసుకోమంటే వినలేదు విని ఉంటే ఇలా జరిగేది కాదు కదా


రుద్రాణి; నా కొడుకు ప్రాణాలకి తెగించి కాపాడేందుకు ట్రై చేశాడు కానీ తల మీద కొట్టి తీసుకెళ్తే ఎవరు ఏం చేస్తాం. ఇదే పరిస్థితిలో రాజ్ ఉంటే ఇలాగే మాట్లాడేవాళ్ళా?


సీతారామయ్య: రాజ్ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోడు. వాడిని నమ్మి గడప దాటి వచ్చిన అమ్మాయి కోసం ప్రాణం ఇస్తాడు కానీ వదిలేసి రాడు


అపర్ణ: రాజ్, రాహుల్ ని పోలుస్తున్నావ్ కానీ స్వప్న గురించి ఆలోచించావా? తనకి ఏమైందా ప్రాణాలతో ఉందో ఆలోచించావా?


Also Read: 'గబ్బర్ సింగ్' స్టైల్ లో ముకుందకి కృష్ణ వార్నింగ్- కొడుక్కి రేవతి సలహా


రుద్రాణి: నా కొడుకుని నిందించడానికి వీల్లేదు


రాహుల్: వాళ్ళు అనే ప్రతి మాట నిజమే. నేను తప్పు చేశాను. స్వప్నకి ఏమైనా అయితే నేను ఆ బాధతో చచ్చిపోతాను. చావు ఒక్కటే సరైన శిక్ష


ధాన్యలక్ష్మి: ఏంటో స్వప్న ఉన్నన్ని రోజులు గొడవ పడుతూ ఉన్నాడు. రుద్రాణి అసలు కోడలిగానే చూడలేదు. ఇప్పుడు ఏంటో ఇలా అంటున్నారని పుల్ల వేస్తుంది


రాహుల్: నువ్వు అన్నది నిజమే పిన్నీ కానీ తను దూరం అయితేనే ఆ బాధ తెలుస్తుంది. తను దూరం అయ్యింది


రాజ్: దూరం అవలేదని స్వప్నని చూపిస్తారు. తనని చూసేసరికి తల్లీకొడుకులకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. షాక్ కొట్టిన కాకుల్లాగా ఫేస్ పెడతారు. వాళ్ళని చూసి ధాన్యలక్ష్మి అదేంటి అలా కొయ్యబారిపోయావ్ అని కౌంటర్ వేస్తుంది. తమ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందని రుద్రాణి రగిలిపోతుంది. స్వప్నని చూడగానే ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు. స్వప్నని ఎవరు తీసుకెళ్లారో తెలిసిందా అని పెద్దాయన అడిగితే తెలిసిందని రాజ్ అనేసరికి రుద్రాణి షాక్ అవుతుంది.


రాజ్: స్వప్న పెళ్ళిలో వెయిటర్ గా వచ్చి తనని ఎత్తుకెళ్లిన వాడే మళ్ళీ ఎత్తుకెళ్లాడు


శుభాష్: ఎందుకు ఎత్తుకెళ్లాడు


రాజ్: పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళాడు. అప్పుడు కుదరలేదని ఇప్పుడు తీసుకెళ్ళాడు. సమయానికి వీళ్ళ అమ్మ తెలుసుకుని మాకు చెప్పింది కాబట్టి వెళ్ళి కాపాడగలిగాము లేదంటే పెళ్లి చేసుకుని అండమాన్ తీసుకెళ్ళే వాడు