నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెప్టెంబరు 16న సీయూఈటీ యూజీ 2022 ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో 30 సబ్జెక్టుల నుంచి 20 వేల మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీటిలో అత్యధికంగా ఇంగ్లిష్ సబ్జెక్టు నుంచి 8,236 విద్యార్థులు మొదటి స్థానంలో ఉండగా, పొలిటికల్ సైన్స్ నుంచి 2,065 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఈ రెండు సబ్జెక్టుల నుంచే దాదాపు 10 వేల మంది 100 పర్సంటైల్ సాధించగా, మిగతా 28 సబ్జెక్టుల నుంచి మరో 10 వేల మంది 100 పర్సంటైల్ సాధించినట్లయింది. 



సీయూసెట్ పరీక్షకు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 2,92,589 విద్యార్థులు హాజరయ్యారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ నుంచి 1,86,405 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అత్యల్పంగా మేఘాలయ నుంచి 583 మంది విద్యార్థులు సీయూసెట్ పరీక్ష రాశారు. సెప్టెంబరు 16న సీయూఈటీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ విడుదల చేసింది. అధికారి వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.



సీయూసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి...

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-2022) నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలు నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 30 వరకు నిర్వహించారు. ఈ పరీక్ష కోసం దాదాపు 14,90,000  మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,68,201 మంది పరీక్షలకు హాజరయ్యారు.



Also Read:

BRAOU: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 
కోర్సులు, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..