M.Ed. & M.P.Ed.- Second & Final Phase of admissions: ఎంఈడీ, ఎంపీఈడీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) సీట్ల భర్తీకి సీపీగెట్ రెండవ, చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యులును కన్వీనర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి నవంబరు 21న ప్రకటించారు. నవంబరు 23 వరకు సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నవంబరు 24, 25 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. నవంబరు 25న ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఆప్షన్లు నమోదుచేసుకున్న వారికి నవంబరు 26న సీట్లు కేటాయించనున్న కన్వీనర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.250; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. నవంబరు 5 నుంచి 11 వరకు 18 వరకు ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 


ఎంఈడీ, ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..


➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్: 23.11.2023. వరకు


➥ అభ్యర్థుల వెరిఫికేషన్ వివరాలు, సవరణకు అవకాశం: 23.11.2023.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 24.11.2023, 25.11.2023.


➥ వెబ్‌ఆప్షన్ల సవరణ: 25.11.2023.


➥ సీట్ల కేటాయింపు: 26.11.2023.


➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 28.11.2023.


Counselling Website




పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్..
తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 18తో ముగిసిన సంగతి తెలిసిందే. సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 20లోగా సంబంధత కళాశాలల్లో చేరిపోయారు. అయితే సీట్లు పొందినా కళాశాలల్లో చేరనివారు, సీట్లు దక్కనివారికి స్పాట్ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నారు. సీపీగెట్ ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కళాశాల యాజమాన్యాల ద్వారా స్పాట్ ప్రవేశాలు పొందవచ్చు. సీపీగెట్ పరీక్షలో అర్హతతోపాటు క్వాలిఫైయింగ్ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు ఉన్నవారు ప్రవేశాలు పొందడానికి అర్హులు.


స్పాట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచిన వారు సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీలతోపాటు, జిరాక్స్ కాపీలు, సీపీగెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్ కార్డుతోపాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్పాట్ ప్రవేశాల ద్వారా పీజీ కళాశాలల్లో మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఇతర కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. 


సంబంధిత కళాశాలలు నవంబరు 25 వరకు అభ్యర్థులకు దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబరు 27లోగా ప్రాసెసింగ్ ఫీజు రూ.2,100 చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ''The Convener, CPGET-2023, O.U.'' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది. “State Bank of India, IFSC Code: SBIN0020071, Osmania University Branch, Bank A/c No.41923342340” ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు. 



ALSO READ:


తెలంగాణ లాసెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్/పీజీఎల్‌సెట్-2023 (LAWCET/PGLCET) ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 21తో రిజిస్ట్రేషన్ గడువు ముగియగా.. నవంబరు 23 వరకు అవకాశం కల్పించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు రెండు రోజులు పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కౌన్సెలింగ్ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...